English   

అల్లు అర్జున్ కి విలన్ గా అనసూయ...టైటిల్ కూడా 

Anasuya
2020-01-20 12:13:07

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ సంక్రాంతికి భారీ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ పాల్గొనక పోయినా మిగిలిన కీలక పాత్రలను పెట్టి షూట్ చేశారు. 

అయితే ఈ సినిమా రెండో షెడ్యూల్ ఈ నెలాఖరున మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాను సుకుమార్ ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో జబర్దస్త్ యాంకర్ అనసూయ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల తర్వాత కథలో ఇది కీలక పాత్ర అని చెబుతున్నారు. 

ఈ సినిమాలో అనసూయ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్టు కొంత ప్రచారం జరుగుతుండగా లేదు విలన్ గ్యాంగ్ కి హెడ్ గా బండిట్ క్వీన్ గా అనసూయ కనిపించనుందని మరో ప్రచారం జరుగుతోంది. ఇందులో అనసూయ వేషధారణ సహా ఆహార్యంలో నెగిటిడ్ షేడ్ గుండెల్ని కొల్లగొడుతుందట. 

రంగమ్మత్త పాత్ర కంటే ఈ పాత్ర మరింతగా గుర్తుండి పోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు ‘శేషాచలం’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ఈ టైటిల్‌‌ను ఫిల్మ్ ఛాంబర్‌లో కూడా రిజిస్టర్ చేయించారట.

More Related Stories