English   

రంగ‌మ్మ‌త్త‌ కోసం చెర్రీ స్పెష‌ల్ వంట‌కం

Anasuya
2021-05-01 14:38:36

హాట్ యాంక‌ర్ అన‌సూయ బ‌ర‌ద్వాజ్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ‌త్త‌ పాత్ర‌లో అద‌ర‌గొట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అన‌సూయ త‌న‌కు షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన ఓ అనుభూతిని గుర్తు చేసుకుని మురిసిపోయింది. రంగ‌స్థ‌లం షూటింగ్ స‌మ‌యంలో ఒక‌రోజు సెట్ లో చేప‌ల క‌ర్రీ చేసార‌ట‌. అయితే అన‌సూయ మాత్రం చేప‌ల క‌ర్రీ తిన‌దంట‌. అయితే అన‌సూయ చేప‌లు తిన‌ద‌ని రామ్ చ‌ర‌ణ్ త‌న చెఫ్ ను పిలిపించి ప‌న్నీర్ ను పెద్ద ముక్కులుగా చేసి చేప‌ల క‌ర్రీలా చేయాల‌ని చెప్పాడ‌ట‌. ఈ విష‌యాన్ని అన‌సూయ తాజాగా షేర్ చేసుకుంది. 

అంతే కాకుండా రామ్ చ‌ర‌ణ్ పై ప్ర‌శంస‌లు కురింపించింది. ఆ స‌మ‌యం చ‌ర‌ణ్ ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ఆయ‌న మెగా ప‌వ‌ర్ స్టార్ అందుకే ప‌ట్టించుకున్నారు. అందుకే డార్లింగ్ అయ్యారు. అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండ‌గా అన‌సూయ ప్ర‌స్తుతం బుల్లితెర‌పై సంద‌డి చేస్తూనే ప‌లు సినిమాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవ‌ల కార్తికేయ హీరోగా న‌టించిన చావు క‌బురు చ‌ల్ల‌గా సినిమాలో ఐటం సాంగ్ కు స్టెప్పులు వేసిన జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ ప్ర‌స్తుతం పుష్ప సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. అంతే కాకుండా ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న ఖిలాడి సినిమాలోనూ కీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్త‌య్యింది. అంతే కాకుండా అన‌సూయ లీడ్ రోల్ చేసిన థాంక్యూ బ్ర‌ద‌ర్ సినిమా ఎప్రిల్ 30న ఆహాలో విడుద‌లైంది. 

More Related Stories