English   

జ‌బ‌ర్ద‌స్థ్ గా ఎంజాయ్ చేస్తున్న రంగ‌మ్మ‌త్త‌..!

anasuya with husbend in maldivs
2018-06-05 07:55:40

అన‌సూయ‌ను ఇప్పుడు పేరు పెట్టి ఎవ‌రూ పిల‌వ‌రేమో..? ఎందుకంటే రంగ‌మ్మ‌త్త‌గా అంత‌గా ఫేమ‌స్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. రంగ‌స్థ‌లం వ‌చ్చి వెళ్లిపోయినా కూడా ఇప్ప‌టికీ రంగ‌మ్మ‌త్త మాత్రం అలాగే ప్రేక్ష‌కుల మ‌దిలో ఉండిపోయింది. ఇంత బిజీగా ఉండి కూడా ఫ్యామిలీకి మాత్రం త‌న టైమ్ కేటాయిస్తుంది ఈ భామ‌. జూన్ 4న అన‌సూయ పెళ్లిరోజు. దాంతో భ‌ర్త‌తో క‌లిసి మాల్దీవ్స్ వెళ్లిపోయింది అను. ఈ మ‌ధ్యే భ‌ర్త‌, పిల్ల‌ల‌తో క‌లిసి పాక్ బార్డ‌ర్ వ‌ర‌కు వెళ్లొచ్చిన అన‌సూయ‌.. ఇప్పుడు మ‌రోసారి రాష్ట్రాలు దాటేసింది. ఏ మాత్రం టైమ్ దొరికినా కూడా లేడీ మ‌హేశ్ బాబులా ఫ్యామిలీ వేసుకుని టూర్స్ కు వెళ్లిపోతుంది అన‌సూయ‌. ఇప్పుడు కూడా భ‌ర్త భ‌ర‌ద్వాజ్ తో క‌లిసి మాల్దీవ్స్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది జ‌బ‌ర్ద‌స్థ్ పోరీ. ఈ మ‌ధ్య‌ టీవీల్లోనే కాదు.. పెద్ద తెర‌పై కూడా బాగానే క‌నిపిస్తుంది అనసూయ‌. రంగ‌స్థ‌లం ఈమె కెరీర్ కు ట‌ర్నింగ్ పాయింట్. ఈ చిత్రం త‌ర్వాత న‌టిగా కూడా బిజీ అయిపోయింది అను. తాజాగా అనిల్ రావిపూడి ఎఫ్ 2లోనూ పెద్ద రోల్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది. ఈ ఫ్యామిలీ టూర్ అయిన త‌ర్వాత వ‌చ్చి మ‌ళ్లీ సీజ‌న్ ను ఫ్రెష్ గా మొద‌లు పెట్ట‌నుంది అనసూయ‌. 

More Related Stories