English   

అనసూయను హర్ట్ చేసిన యాంకర్  

anasuya
2021-06-21 12:44:49

జబర్దస్త్ కు ముందు అనసూయ కొన్ని చిన్న షోలలో యాంకర్ గా చేసినా జబర్దస్త్ తెచ్చిన క్రేజ్ ని ఏ షో ద్వారా కూడా రాలేదని చెప్పవచ్చు. ఇక రంగస్థలం లో రంగమ్మత్త లాంటి ఒకటి రెండు పాత్రలు తప్ప సినిమాల్లో కూడా పెద్దగా గుర్తుండిపోయే పాత్ర ఎప్పుడూ దక్కలేదు. ఇదిలా ఉండగా అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ పై సోషల్ మీడియాలో ఎప్పుడూ రచ్చ నడుస్తూనే ఉంటుంది. దానికి అనసూయ కూడా గట్టిగా స్పందిస్తూ నే ఉంటుంది.

 నా జీవితం నా ఇష్టం, నేను ఎలా ఉంటే నీకు ఎందుకు అంటూ పలుమార్లు సోషల్ మీడియా వేదికగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్లీ అదే విషయం తెరపైకి వచ్చింది. జబర్దస్త్ లో టీమ్ లీడర్ అయిన హైపర్ ఆది స్కిట్ లో గెస్ట్ లా యూట్యూబ్ యాంకర్ శివ రావడం జరిగింది. యాంకర్ శివ అనసూయను "మీరు ఎందుకు ఎప్పుడూ పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు..? అని అడగగా దానికి స్పందిస్తూ అనసూయ 'ఇండస్ట్రీ కి సంబంధం లేని వారు అడిగారు అంటే ఏమో అనుకోవచ్చు. మీరు కూడా అడగడం బాగాలేదు. అది నా పర్సనల్ విషయం అని అంది, 

దానితో శివ మీ పర్సనల్." అంటూ సమాధానం ఇచ్చింది.  అయితే దానికి శివ "ఇంట్లో వేసుకోవచ్చు కదా... పదిమందిలో ఎందుకు చూపించడం" అంటూ కౌంటర్ వేశాడు. దానికి అనసూయ తీవ్రమైన కోపంతో సెట్ నుండి బయటకు రావడం జరిగింది. మరి ఇది నిజమా లేక రేటింగ్ కోసం ఆడుతున్న డ్రామానా అన్నది తెలియాలంటే గురువారం షో ప్రసారమయ్యే  వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే జబర్దస్త్ లో ఇలాంటివి ఎన్నో సార్లు జరిగాయి ప్రోమో లో గొడవలా చూపించి తర్వాత వాటిని ఫ్రాంక్ అని కవర్ చేయడం కామన్.

More Related Stories