English   

ఎంత చూపించినా రష్మి కి పని జరగట్లేదు

Anchor Rashmi Gautam Hottest Glamour Show Also Not Getting
2018-08-05 23:00:30

మితిగా తింటే ఆహారం.. అతిగా తింటే విషం.. అందాల ఆర‌బోత‌లోనూ అంతే. అంతంత మాత్రంగా చూపిస్తేనే ఆవురావురమంటూ చూస్తారు. అలా కాద‌ని మొత్తం చూపించేస్తే చూడ్డానికి ఇంకేం ఉండ‌దు.. అస‌హ్యం త‌ప్ప‌. ఇప్పుడు ర‌ష్మిని చూస్తే ఇదే అనిపిస్తుంది. అప్ప‌ట్లో గుంటూర్ టాకీస్ కోసం సెగ‌లు పుట్టించింది ఈ భామ‌. అవి చ‌ల్లార‌క ముందే రెచ్చిపోతూనే ఉంది ర‌ష్మి. అస్స‌లు త‌గ్గేదే లేద‌న్న‌ట్లు అంతం, రాణి గారి బంగ‌ళా.. ఇలా ఏ సినిమా ప‌డితే అందులో అందాల‌న్నీ ఆర‌బోసింది. కెమెరాకు త‌న అందాల‌న్నీ బేరం పెట్టేసింది ఈ జ‌బ‌ర్ద‌స్థ్ పోరీ.

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇన్నాళ్ళైనా ఇంకా ఎవ్వ‌రూ త‌న‌ను ప‌ట్టించుకోవ‌ట్లేద‌నే క‌సో.. లేదంటే వ‌చ్చిన అవకాశాన్ని ఎలాగైనా ఒడిసి ప‌ట్టుకోవాల‌నో తెగింపో తెలియ‌దు గానీ గుంటూర్ టాకీస్ లోనే బాగా రెచ్చిపోయింది ర‌ష్మి. ఓ సారి హ‌ద్దు దాటిన త‌ర్వాత మ‌ళ్లీ దాటితే ఏంటి అనుకుందో ఏమో.. ఇప్పుడు అంతం సినిమా కోసం మ‌రోసారి అందాల బారికేడ్లు తెంచేసింది ర‌ష్మి. అస‌లు తెలుగు సినిమాల్లో మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌నంత హాట్ గా తెర‌పై అందాల్ని ఆర‌బోసింది. కేవ‌లం ర‌ష్మి పుణ్య‌మా అని గుంటూర్ టాకీస్ కాస్తో కూస్తో న‌డిచింది.

ఫ‌స్ట్ టైమ్ కాబ‌ట్టి గుంటూర్ టాకీస్ కు ప్రేక్ష‌కులు బాగానే క‌నెక్ట్ అయ్యారు. కానీ ప్ర‌తీసారి అవే అందాలంటే ఎవ్వ‌రికైనా వెగ‌టు పుడుతుంది. ఇదే ఇప్పుడు ర‌ష్మి పాలిట శాపంగా మారుతోంది. అంతం, రాణి గారి బంగ‌ళా సినిమాలు ఎప్పుడొచ్చాయో.. ఎప్పుడెళ్లాయో కూడా క్లారిటీ లేదు. ర‌ష్మిని చూపించి బిజినెస్ చేసుకుందామ‌ని క‌ల‌లు క‌న్న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఇప్పుడు ఊహించ‌ని షాక్ త‌గులుతుంది. ఇప్పుడు అంత‌కుమించి అంటూ మ‌రో సినిమాలోనూ ఇలాగే అందాల‌న్నీ ఆర‌బోసింది. ఈ సినిమాకు క‌నీసం పోస్ట‌ర్ ఖ‌ర్చులు కూడా వ‌చ్చేలా క‌నిపించ‌ట్లేదు. మొత్తానికి ఇప్ప‌టికైనా ర‌ష్మి కాస్త త‌గ్గుతుందేమో చూడాలి.

More Related Stories