English   

తొడ‌లు నచ్చినందుకు థ్యాంక్స్

Anchor Rashmi Gautam Thighs Likes RX 100 Director Ajay Bhupathi
2018-08-07 16:17:12

మాట్లాడ‌టానికి కూడా ఇబ్బందిగా ఉండే భాష ఇది. కానీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌ర్వాత సిగ్గు అనేది ఉండ‌కూడ‌దు అంటారు క‌దా.. అందుకే ఇప్పుడు పూర్తిగా మ‌న‌సు విప్పి మాట్లాడుకుంటున్నారు ర‌ష్మి-అజ‌య్ భూప‌తి. ఆర్ఎక్స్ 100 లాంటి అడ‌ల్ట్ సినిమా తీసిన అజ‌య్ భూప‌తి నుంచి ఆడ‌వాళ్లపై కాస్త సంస్కారం ఊహించ‌డం క‌ష్ట‌మే. అలాంటిది క‌నీసం ఆయ‌న నుంచి ఆశించ‌కూడ‌దు. అనుకున్న‌ట్లుగానే యాంక‌ర్ ర‌ష్మి తొడ‌ల‌పై హాట్ కామెంట్స్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. దీనిపై కొంద‌రు సీరియ‌స్ కూడా అయ్యారు. అంత‌కుమించి ట్రైల‌ర్ లో కానీ.. పోస్ట‌ర్ లో కానీ ర‌ష్మి తొడ‌లు త‌న‌కు బాగా న‌చ్చాయ‌ని.. వెనుక సముద్రం సీన్ చూసి తన మైండ్ బ్లాక్ అయిందని అజయ్ భూపతి హాట్ కామెంట్స్ చేసాడు.

దీంతో ఈ ద‌ర్శ‌కుడిపై అంతా విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. అస‌లు ఓ అమ్మాయి గురించి అలా ఎలా మాట్లాడ‌తారు అంటూ ర‌చ్చ చేసారు. అయితే ర‌ష్మి మాత్రం ఈయ‌న కామెంట్స్ ను పాజిటివ్ గా తీసుకుంది. అన‌వ‌స‌రంగా కాంట్ర‌వ‌ర్సీ చేయ‌డం ఎందుకు అనుకుందో ఏమో కానీ తమ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నందుకు అజయ్ కు రష్మి థ్యాంక్స్ చెప్పింది. త‌న‌పై అజయ్ చేసిన కామెంట్స్ ను కాంప్లిమెంట్స్ గా తీసుకుంటాన‌ని చెప్పి షాక్ ఇచ్చింది. అంతేలెండి.. దుంప‌కు లేని నొప్పి క‌త్తికి మాత్రం ఎందుకు..? ర‌ష్మి మాట‌లు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది ఇప్పుడు.

More Related Stories