English   

శివాజీరాజాని ఇబ్బంది పెట్టిన యాంకర్ శ్యామల !

Anchor Shyamala Tongue Slip At Suryakantham Movie Pre Release Event
2019-03-24 09:29:15

గత రెండు నెలలుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలని తలపించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో శివాజీరాజా, నరేష్ లు పోటీ పడగా అందులో నరేష్ విజయం సాదించాడు. ఈ విషయం అందరికీ తెలుసు, అయితే టీవీ యాంకర్, నటి అయిన శ్యామల మాత్రం ‘మా’ ఎన్నికల్లో గెలిచింది శివాజీ రాజానే అనుకుంటున్నట్టుంది పాపం. ఆమె అనుకుంటే పర్లేదు, లైవ్ లో అందరి ముందూ మా ఎన్నికల్లో గెలిచారు కదా మీ ఫీలింగ్ ఎలా ఉందని ఆయన్నే అడిగి నవ్వులు పూయించింది. ఈ వ్యవహారం అంతా నిన్న జరిగిన సూర్యకాంతం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చోటు చేసుకుంది. ఈవెంట్ మొదలవడానికి ముందు అందరి దగ్గరకీ వెళ్లి కాన్సెప్ట్ లో భాగంగా మీ నిజ జీవితంలో సూర్యకాంతం ఎవరు అనే ప్రశ్న అడిగి సమాధానాలు రాబట్టిన ఆమె, శివాజీరాజా దగ్గరకు వెళ్లి మా ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకున్నారు దానికి కంగ్రాట్స్ చెప్పింది. మీరు గెలిచిన తరువాత ఫస్ట్ ఫంక్షన్ అనుకుంటా అనే సరికి పాపం శివాజీ రాజా తెల్లమొహం వేశారు. గెలిచింది నేను కాదు అంటూ ఆయన సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా శ్యామలకి విషయం అర్ధం కాలేదు. దీంతో పాపం శివాజీ రాజా తల్లీ గెలిచింది నేను కాదు, నా టీంలో కొంతమంది మాత్రమే గెలిచారని అన్నారు. అప్పుడు కూడా ఈవిడకి బల్బ్ వెలగలేదో, లేక వెలిగి కూడా కవర్ చేయడానికి ప్రయత్నం చేసిందో కానీ మీ టీం గెలవడం అంటే మీరు ముందుండి గెలిపించడమే కదండీ అంటూ కవర్ డ్రైవ్ వేసుకుంది. అయితే నిజంగా శ్యామలకి ఈ విషయం తెలియదా అనే అనుమానాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

More Related Stories