English   

ఆండ్రియా సంచ‌ల‌నం.. శ్రీ‌రెడ్డి అరాచ‌కం..!

Andrea-Jeremiah-Srireddy
2018-08-11 19:26:47

ఆండ్రియా.. ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేక‌పోవ‌చ్చు కానీ ఒక్క‌సారి యుగానికి ఒక్క‌డు గుర్తు చేసుకుంటే అందులో ప్రొఫెస‌ర్ కూతురుగా న‌టించింది ఈ భామ‌. ఆ త‌ర్వాత తెలుగులో సునీల్ తో త‌డాఖా సినిమాలో జోడీ క‌ట్టింది. త‌మిళ‌నాట ఈ భామ‌కు మంచి ఇమేజ్ ఉంది. పైగా ఆ మ‌ధ్య అనిరుధ్ తో ప్రేమాయ‌ణం న‌డిపి బాగా పాపుల‌ర్ అయింది ఆండ్రియా. ఆ మ‌ధ్య గృహం సినిమాలో సిద్ధార్థ్ తో క‌లిసి అదిరిపోయే హాట్ షో చేసింది ఈ ముద్దుగుమ్మ‌. అందులో మూతి ముద్దుల‌తో పాటు బెడ్రూమ్ సీన్స్ లో కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఆండ్రియా. ఇప్పుడు విశ్వ‌రూపం 2 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది ఈ భామ‌. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగానే క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది ఆండ్రియా. 

గతంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి అడిగితే అవును.. ప‌డుకుంటారు.. అమ్మాయిల‌కు ఇష్ట‌మై ప‌డుకుంటున్న‌పుడు మీకు ఏంటి సమ‌స్య అంటూ రెచ్చిపోయింది ఆండ్రియా. ఇక ఇప్పుడు శ్రీ‌రెడ్డి ఇష్యూ గురించి కూడా నోరు విప్పింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్య ఎక్కడికి వెళ్లినా శ్రీరెడ్డి పోరాటం గురించే అడుగుతున్నార‌ని.. ఆమె చెప్పేదంతా నిజమైతే మొత్తం బ‌య‌ట‌పెట్టాలి.. అలా జ‌ర‌క్కూడ‌దు.. త‌న‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ అలాంటి ఒత్తిడి చేయ‌లేదు అని చెప్పింది ఆండ్రియా. నిజంగా అలాంటివి జరిగితే ధైర్యంగా బయటపెట్టడం మంచిందే క‌దా.. సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ పెంచి పోషిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని చెప్పింది ఆండ్రియా. శ్రీ‌రెడ్డి పోరాటానికి త‌న మ‌ద్దతు ఇస్తాన‌ని చెప్పింది ఈ భామ‌.

More Related Stories