English   

ఎఫ్ 3 ఎఫ్ 2 కి సీక్వెల్ కాదట...కానీ

Anil Ravipudi
2020-01-17 12:44:13

గతేడాది సంక్రాంతి అల్లుళ్లుగా ‘F2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్, వరుణ్ తేజ్‌లు ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఆ ఏడాది వినయ విధేయ రామ, కథానాయకుడు, పేటా చిత్రాలతో పోటీ పడుతూ జనవరి 12న విడుదలైన ఈ మూవీ క్లీన్ హిట్‌గా మిగతా సినిమాలను పక్కన పడేసింది. ఇక ‘F2’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘F3’ చిత్రాన్ని సీక్వెల్ తీయబోతున్నట్టు అప్పట్లోనే ప్రకటించారు అనిల్ రావిపూడి. 

అయితే ‘F3’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో మరో హీరోని యాడ్ చేయబోతున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అంతేకాక ఆ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చేస్తుందని కూడా ప్రచారం జరగగా ఈ ఏడాది మహేష్ తో సరిలేరు నీకెవ్వరు చేసి హిట్ కొట్టాడు అనిల్. అయితే త్వరలోనే 'ఎఫ్-3' మొదలయ్యే అవకాశముందని అంటున్నారు. 

'సరిలేరు నీకెవ్వరు' ప్రమోషన్లలో భాగంగా అనిల్ మరోసారి 'ఎఫ్-3' గురించి మాట్లాడాడు. ఎఫ్-3' సినిమా కోసం ఇప్పటికే ఒక లైన్ అనుకున్నానని. అది 'ఎఫ్-2' స్టయిల్లో ఉండదని అనిల్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా 'ఎఫ్-2'కు సీక్వెల్ కూడా కాదని ఆ సినిమా అదే మనుషులతో కొత్తగా ఉంటుందని చెప్పాడు. 'ఎఫ్-2'లో ప్రేమ, పెళ్లి తర్వాత వచ్చే మనస్పర్ధల మీద కథ నడిపించానని.. కానీ 'ఎఫ్-3'లో హీరో హీరోయిన్ల కెరీర్ మీద కథ ఉండనుందట. 'ఎఫ్-2' అంటే 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' అయితే.. 'ఎఫ్-3' అంటే 'ఫన్, ఫ్రస్టేషన్ అండ్ మోర్ ఫన్' అని చెబుతున్నారు.

More Related Stories