English   

పాట కోసం 20 లక్షలు...అదీ నరేష్ కోసం ?

allari-naresh
2019-03-18 10:37:43

తెలుగు సినిమాల్లో పాత పాటలను రీమిక్స్ చేయడం కొత్త విషయమేమీ కాదు. అప్పటి సూపర్ హిట్ సాంగ్స్ తీసుకుని ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు రీమిక్స్ చేస్తున్నారు నేటి సంగీత దర్శకులు. ఎక్కువగా అలా చిరంజీవి సాంగ్స్ రీమిక్స్ చేసుకుని సినిమాకి క్రేజ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మెగా కాంపౌండ్ హీరోలు. అయితే హీరోగా నాలుగేళ్ల‌గా ఒక్క హిట్ లేక త‌ల్ల‌డిల్లిపోతున్న అల్ల‌రి న‌రేష్‌. మ‌హేష్ బాబు సినిమా మ‌హ‌ర్షిలో ఒక మంచి రోల్ లో నటిస్తున్నాడు అన్న వార్త ఒకటి తప్ప ఆయన వేరే సినిమా చేస్తున్నట్టు వార్తలు రాలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం మనోడు హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. నందిని న‌ర్సింగ్ హోమ్‌తో ఆక‌ట్టుకున్న గిరి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ సినిమా కోసం బంగారు బుల్లోడు అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. టైటిల్ వాడుకోడమే కాక  ఆ సినిమాలోని స్వాతిలో ముత్య‌మంత అనే పాట‌ని రీమిక్స్ చేయాల‌ని భావిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంక‌ర బాల‌య్య‌కు పెద్ద ఫ్యాన్‌. అందుకే బాల‌య్య టైటిల్‌నీ, పాట‌నీ ఈసినిమా కోసం వాడుకోవాల‌ని చూస్తున్నాడ‌ని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పాట రీమిక్స్ చేయడానికి అయిన ఖర్చు అక్షరాలా 20 లక్షలలనేదే కాస్త షాకింగ్ గా ఉంది. ఎందుకంటే ఒక పాత పాటని రీమిక్స్ చేయడానికి ఆ పాటని స్వరపరిచిన సంగీత దర్శకుడు, రాసిన రచయిత, ఆ సినిమా నిర్మాతల అనుమతి తీసుకోవాలి. అందుకు గాను అనిల్ సుంకర 20 లక్షలు ఖర్చు చేశారట. ఇంత ఖర్చు కేవలం పాత తీసుకున్నందుకే మళ్ళీ దాని షూట్, సెట్స్ అదనం. మరి ఇంత కష్టపడి ఈ సినిమాలో పాట పెడుతున్నారు ఈ సినిమా అయినా నరేష్ కి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

More Related Stories