English   

ఏంటి.. అనిరుధ్ ఇంకా ఉన్నాడా..?

Anirudh-ntr

ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ సినిమా ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతుంది. ఒక్క ఫ్లాప్ తో పడిపోయే ఇమేజ్ కాదు త్రివిక్ర‌మ్ ది. అజ్ఞాత‌వాసి అంత పెద్ద ఫ్లాప్ అయినా కూడా ఇప్ప‌టికీ త్రివిక్ర‌మ్ త‌న సినిమా కోసం తన‌కేం కావాలో డిమాండ్ చేసుకునే స్థాయిలోనే ఉన్నాడు. ఎన్టీఆర్ సినిమాకు దేవీ శ్రీ ప్ర‌సాద్ వ‌చ్చాడ‌నే వార్త‌లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అనిరుధ్ పై ఎన్టీఆర్ కూడా పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌డం లేదు. త‌న‌కు దేవీనే కావాల‌ని ప‌ట్టుబ డుతున్నాడు యంగ్ టైగ‌ర్. కానీ దేవీ శ్రీ ప్ర‌సాద్ తో త్రివిక్ర‌మ్ కు గొడ‌వైంది. దాంతో అనిరుధ్ నే తీసుకుంటున్నాడు మాట‌ల మాంత్రికుడు. దేవీని వ‌ద్దు అని ఎన్టీఆర్ ను క‌న్విన్స్ చేసిన‌ట్లుగా తెలుస్తుంది. ఇప్ప‌టికీ ఈ ప్రాజెక్ట్ లో అనిరుద్ధే ఉన్నాడు. అఫీషియ‌ల్ గా అయితే ఇప్ప‌టి వ‌ర‌కు దేవీ ఈ సినిమాలోకి వ‌చ్చిన‌ట్లుగా ఎక్క‌డా రాలేదు.. అంతా మీడియాలో వ‌స్తున్న వార్త‌లు త‌ప్ప‌. 

ఈ లెక్క‌న త్రివిక్ర‌మ్ ఇప్ప‌టికీ త‌న మాటే నెగ్గించుకుంటు న్నాడు. అంతేకాదు.. హీరోయిన్ గా కూడా ఎవ‌రెవ‌రి పేర్లో వినిపిస్తున్నాయి. కానీ ముందు అనుకున్న అను ఎమ్మాన్యువ‌లే ఈ చిత్రంలో ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈమె త్రివిక్ర‌మ్ ఇంట్రెస్ట్. ఇప్ప‌టికే అజ్ఞాత‌వాసిలో న‌టించింది.. హారిక హాసినిలో నాగ‌చైతన్య హీరోగా వ‌స్తోన్న శైల‌జారెడ్డి అల్లుడులోనూ త్రివిక్ర‌మ్ రిఫ‌రెన్స్ తోనే ఆఫ‌ర్ అందుకుంద‌నే వార్త‌లున్నాయి. ఇదే టైమ్ లో ఇప్పుడు తాను తెర‌కెక్కించబోయే ఎన్టీఆర్ సినిమాలో అనుకే అవ‌కాశాలు ఎక్కువ‌గానే ఉన్నాయి. మొత్తానికి ఫ్లాప్ ప‌డిన త‌ర్వాత కూడా త్రివిక్ర‌మ్ జోరు అయితే త‌గ్గ‌డం లేదు.. ఎవ‌రికీ లొంగ‌డం లేదు.. తాను అనుకున్న‌దే పూర్తి చేస్తున్నాడు మాట‌ల మాంత్రికుడు. ఈ చిత్రం మార్చ్ 18న హైద‌రాబాద్ లోనే మొద‌లు కానుంది. 

More Related Stories