English   

త్రివిక్రమ్ నో అన్నాడు.. సూపర్ స్టార్.. రా అన్నాడు..

anirudh and trivikram

టాలెంట్ ఉండాలే గానీ ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యమే. అదే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ను త్రివిక్రమ్ నో అన్నా అంతకంటే పెద్ద ఆఫర్ కొట్టేలా చేసింది. యస్.. అజ్ఙాతవాసితో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన అనిరుధ్ కు తొలి సినిమాతో చేదు అనుభవం ఎదురైంది. అఫ్ కోర్స్.. అది అతని పనికి వచ్చిన రిజల్ట్ కాదు. మొత్తంగా సినిమా డిజాస్టర్ కావడంతో.. తలా ఫ్లాప్ తిలా పిడికెడు అన్నట్టుగా మాగ్జిమం అనిరుధ్ ను బలి చేశారు. పైగా ఇతన్ని ఏరికోరి తెచ్చుకున్న త్రివిక్రమ్ కూడా ఆశ్చర్యంగా అతన్ని పట్టించుకోవడం మానేశాడు. నిజానికి అజ్ఙాతవాసికి ఒప్పుకున్నప్పుడే రెండు సినిమాలకు మ్యూజిక్ చేయిస్తానని చెప్పాడు త్రివిక్రమ్. ఇందుకోసం కుర్రాడికి ఏకంగా రెండుకోట్ల 37లక్షలు క్యాష్ చెల్లించారు. అఫ్ కోర్స్ ఈ ఫిగర్ ఒక్క సినిమాకే అనుకోండి. ఒక్క సినిమాకే ఇంత ఇచ్చారంటే అతని టాలెంట్ ను అంతలా నమ్మారనుకోవచ్చు. మ్యూజిక్ పరంగా అనిరుధ్ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చినా మూవీ ఫ్లాప్ తో అతను సెంటిమెంట్ అయిపోయాడు. దీంతో త్రివిక్రమ్-  ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకు కనీసం ఇతనికి సమాచారం కూడా ఇవ్వకుండా తమన్ ను తీసుకున్నారు. ఈ విషయంలో కుర్రాడు కాస్త ఫీలయ్యాడు. కానీ అతనికి ఇప్పుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ కంటే ఎంతో పెద్ద సినిమా తగిలింది. యస్.. అనిరుధ్ లేటెస్ట్ గా మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ బ్యాగ్ చేసుకున్నాడు.

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకు సంగీతం ఇస్తే అదిం ఇంటర్నేషన్ గా ఫేమ్ తెస్తుంది. ఇండియాలో ఏ హీరోకు లేని మార్కెట్ ఇతర దేశాల్లో రజినీకి ఉంది. ఇప్పుడు అనిరుధ్ కు వచ్చిన చాన్స్ సూపర్ స్టార్ మూవీదే.యస్.. సూపర్ స్టార్ రజినీకాంత్, కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్ లో రాబోయే సినిమాకు అనిరుధ్ నే తీసుకున్నారు. నిజానికి అనిరుధ్ యూత్ ఫుల్ మ్యూజిక్ ఎక్కువగా ఇస్తాడనే పేరుంది. అయినా ఏరికోరి తీసుకున్నారంటే ఖచ్చితంగా అతని ఒరిజినల్ టాలెంట్ కూడా తెలిసే ఉంటుంది కదా. ఏమైనా త్రివిక్రమ్ మూవీ మిస్ అయిందని ఫీలవుతోన్న ఈ కుర్రాడికి ఏకంగా సూపర్ స్టార్ మూవీయే రావడం ఆశ్చర్యమే. ఇక ఈ ఛాన్స్ తో ఇంకెప్పుడూ తెలుగువైపు చూడడేమో అనిరుధ్.  

More Related Stories