English   

మ‌నమ్మాయే.. కాస్త ప‌ట్టించుకోండ‌య్యా..!

Anisha-Ambrose

ఎవ‌రా మ‌న‌మ్మాయి అనుకుంటున్నారా..? ఇంకెవ‌రు విశాఖ‌ప‌ట్నం బ్యూటీ అనీషా ఆంబ్రోస్.. తెలుగు అమ్మాయిలు ఎక్స్ పోజింగ్ చేయ‌రేమో అనే సంప్ర‌దాయానికి ఈ మ‌ధ్య కాలంలో పూర్తిగా చెక్ పెట్టిన బ్యూటీ అనీషా ఆంబ్రోస్. అవ‌కాశం రావాలే కానీ దేనికైనా సిద్ధ‌మే అంటుంది. అనీషా పేరు ఆ మ‌ధ్య బాగా వినిపించింది. జ‌స్ట్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ భామ వైపు ఓ క‌న్నేసాడ‌ని అంతే. అవును.. అప్ప‌ట్లో గ‌బ్బ‌ర్ సింగ్ 2లో అనీషానే హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఏమైందో ఏమో గానీ స‌డ‌న్ గా అనీషా మాయ‌మై.. కాజ‌ల్ ఆ ప్లేస్ లోకి వ‌చ్చేసింది. కానీ ప‌వ‌న్ తో న‌టించ‌బోతుంది అనే క్రేజే అనీషాను అంద‌రి దృష్టిలో ప‌డేలా చేసింది. 

అంత‌కుముందు ఈ భామ అలియాస్ జాన‌కీ అనే సినిమాలో న‌టించింద‌నే విష‌యం కూడా చాలా మందికి తెలియ‌దు. ప‌వ‌న్ పుణ్య‌మా అని.. ఆయ‌న‌తో న‌టించ‌కుండానే క్రేజ్ తెచ్చుకుంది అనీషా. ప‌వ‌న్ తో న‌టించే అవ‌కాశం మిస్సైనా.. ఆ క్రేజ్ తోనే కొన్ని అవ‌కాశాలు అందుకుంది అనీషా ఆంబ్రోస్. అయితే ఎన్ని సినిమాలు చేసినా అనీషా కెరీర్ మాత్రం గాడిన ప‌డ‌ట్లేదు. దాంతో హీరోయిన్ల ఆయుధమైన‌ అందాల ఆర‌బోత‌ను బ‌య‌టికి తీసింది అనీషా ఆంబ్రోస్. 

తాజాగా ఓ ఫోటోషూట్ లో అమ్మ‌డు ఫుల్ గా ఎక్స్ పోజింగ్ చేసింది. చిరిగిన ప్యాంట్ ల‌తో కొల‌త‌లు చూపిస్తూ క‌వ్విస్తుంది ఈ వైజాగ్ పిల్ల‌. ఈమె దూకుడు చూస్తుంటే దేనికైనా రెడీ.. ఒక్క చాన్స్ ఇవ్వండి అన్న‌ట్లుంది. కానీ ద‌ర్శ‌కులే క‌రుణించ‌ట్లేదు. ఈ మ‌ధ్య ఈ న‌గ‌రానికి ఏమైందిలోనూ హాట్ హాట్ గా క‌నిపించి పిచ్చెక్కించింది అనీషా. మ‌రి చూడాలిక‌.. ఇప్ప‌టికైనా ఎవ‌రో ఒక‌రు క‌రుణించి అనీషాను ఆదుకోక‌పోరు. 

More Related Stories