English   

కరోనా వార్తలపై అంజలి క్లారిటీ ... వైరస్ సోకలేదు

Anjali
2021-04-08 17:41:55

హీరోయిన్ అంజలికి కరోనా వచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. దానిపై అంజలి కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో అంతా ఇది నిజమే అనుకున్నారు. పైగా వకీల్ సాబ్ సినిమాలో ఈమెతో పాటు కలిసి నటించిన నివేదా థామస్ కు ఈ మధ్య కరోనా వచ్చింది. దానికి తోడు ఇద్దరూ కలిసి ప్రమోషన్ కూడా చేశారు. దాంతో అంజలికి కరోనా సోకి ఉంటుందని అంతా అనుకున్నారు. ఈ వార్తలు ఇప్పుడు ఎక్కువైపోవడంతో తన సోషల్ మీడియా పేజీలో దీని గురించి కామెంట్ చేసింది అంజలి. ఈ విషయంపై ఒక లెటర్ విడుదల చేసింది.

‘అందరికీ నమస్కారాలు.. నాకు కోవిడ్ వచ్చింది అంటూ చాలా మీడియా మాధ్యమాలలో వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు. నాకు వైరస్ సోకలేదు’ అని చెప్పుకొచ్చింది. ఇదంతా తప్పుడు వార్తలు అని కొట్టేసింది అంజలి. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని ఇలాంటి వార్తలు నమ్మొద్దని అంటూ అభిమానులను కోరింది.

More Related Stories