English   

జైతోనే కాదు ఎవరితోనూ అఫైర్ లేదు...అపార్ధం చేసుకోవద్దు ?

Anjali
2019-05-20 16:12:33

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర లేని నటి అంజలి. తెలుగమ్మాయి అయినా తమిళ ప్రేక్షకులకి ముందుగా పరిచయమైన ఈ భామకి తెలుగులోను మంచి క్రేజ్ వుంది. తెలుగులో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి లాంటి హిట్ సినిమాల్లో నటించారు. ఆమె ప్రేమలో పడ్డట్లు గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.  తమిళ హీరో జైతో ప్రేమలో ఉన్నట్లు సిని వర్గాల టాక్. అంతేకాకుండా  జంట కలిసి ఉన్న ఫొటోలు ఇప్పటికే అనేకమార్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి కూడా. దీంతో వీరు ప్రేమలో ఉన్నారనే వదంతులు నిజమేనని అందరూ భావించారు. అంతేకాక త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అనుకున్నారు ప్రేక్షకులు. ఇక ఆమె నటించిన తాజా సినిమా లిసా ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా అంజలి జైతో బంధం గురించి  స్పష్టం చేసింది.  తాజాగా అంజలి ఇచ్చిన  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు అఫైర్ ఉందనీ .. బ్రేకప్ జరిగిందనే వార్తలు చాలా రోజులుగా షికారు చేస్తున్నాయి. నాకు ఎవరితోను అఫైర్ లేదు కనుక, బ్రేకప్ జరిగే ఛాన్స్ లేదు. స్నేహాన్ని చూసి అపార్థం చేసుకోవద్దని, మా మధ్య ఎటువంటి బంధం లేదని జైని ప్రేమించడం లేదని స్పష్టం చేసింది. అలాగే ఇప్పట్లో పెళ్లి ఆలోచన కూడా లేదని ఎందుకంటే నా దృష్టి అంతా కూడా సినిమాలపైనే వుందని ఆమె చెప్పుకొచ్చింది.
 

More Related Stories