English   

లుక్ తో షాక్ ఇచ్చిన సీత‌మ్మ..

anjali-silm

తెలుగు ఇండ‌స్ట్రీలో ఏదైనా కారెక్ట‌ర్ తో ఒక్క‌సారి ఫేమ‌స్ అయితే కెరీర్ అంతా అదే క‌నిపిస్తుంది. చాలా మంది ఇంటి పేరులా ఆ కారెక్ట‌ర్ పేరు కూడా ముందే చేరుకుంటుంది. అంజ‌లి పేరు ముందు మ‌రో పేరు ఉంటుంది. అదే సీత‌మ్మ. అప్పుడెప్పుడో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టులో టైటిల్ రోల్ చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది అంజ‌లి. తెలుగులోనే ఈమె కెరీర్ మొద‌లుపెట్టినా.. ఇక్క‌డ మాత్రం గుర్తింపు రాలేదు. దాంతో త‌మిళ ఇండ‌స్ట్రీకి వ‌ల‌స వెళ్లింది ఈ ముద్దుగుమ్మ‌. అక్క‌డ అదృష్టం క‌లిసొచ్చి స్టార్ హీరోల‌తో న‌టించింది. కానీ ఏం చేస్తాం.. స్టార్ ఇమేజ్ మాత్రం తెచ్చుకోలేక‌పోయింది. ఇక్క‌డ కూడా స్టార్స్ తో న‌టించినా అంజ‌లి జాత‌కం మార‌లేదు. చివ‌రికి ఐటం సాంగ్స్ చేసినా అంజ‌లిని తెలుగు ఇండ‌స్ట్రీ ప‌ట్టించుకోవ‌డం లేదు. దాంతో చిన్నాచిత‌కా సినిమాల‌తో కాలం గ‌డిపేస్తోంది ఈ బ్యూటీ. మ‌రో వైపు త‌మిళ‌నాట త‌న ప్రియుడు జైను త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతుంది అంజ‌లి. ఈ మ‌ధ్య బాగా లావుగా మారిపోయిన అంజ‌లి.. మ‌రోసారి ఫిజిక్ పై దృష్టి పెట్టిన‌ట్లు క‌నిపిస్తుంది. తాజాగా ట్రెండీ లుక్ తో పిచ్చెక్కించింది అంజ‌లి. బాగా చిక్కిపోయి మ‌రింత అందంగా క‌నిపించింది ఈ భామ‌. ఇదివ‌ర‌క‌టితో పోలిస్తే చాలా స‌న్న‌బ‌డింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ స‌న్న‌బ‌డిన లుక్ తో అయినా మ‌రో రెండు మూడు సినిమాలు ప‌ట్టేద్దామ‌ని ప్లాన్ చేస్తుంది. మ‌రి ద‌ర్శ‌కులు క‌రుణిస్తారో లేదో చూడాలిక‌..!

More Related Stories