English   

అన్నపూర్ణ కూతురు ఆత్మహత్య..?

annapurna

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి అన్నపూర్ణ ఇంటిలో విషాదం నెలకొంది. అన్నపూర్ణ దత్త కూతురు కీర్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత కొన్నాళ్లుగా కీర్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు కూడా. అయితే రెండేళ్లు దాటినా ఆ వ్యాధి ఎంతకూ తగ్గకపోవడంతోనే ఉరి వేసుకున్నట్టు అన్నపూర్ణతో పాటు కీర్తి భర్త కూడా చెబుతున్నారు. అయితే  కీర్తి ఆత్మహత్యను పోలీస్ లు అనుమానాస్పద కేస్ గా నమోదు చేసుకోవడం విశేషం. 

అన్నపూర్ణకు సంతానం లేరు. అందుకే చిన్నతనంలనే కీర్తిని దత్తత తీసుకున్నారు. కొన్నాళ్ల క్రితమే కీర్తికి పెళ్లి చేశారు. ఆమె భర్త బళ్లారిలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఒక సంతానం కూడా ఉంది. మరి సడెన్ గా ఆమె ఈ ఆత్మహత్య చేసుకోవడం వెనక కేవలం నయం కాని జబ్బు మాత్రమే కారణమా లేక ఇంకేవైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీస్ లు విచారణ చేస్తున్నారు. 

More Related Stories