English   

పాపం నిహారిక.. ఏం చేస్తుందిక..

Niharika-Konidela
2018-07-30 17:13:49

మెగా వారమ్మాయి అనగానే అంచనాలు.. ఆసక్తి మరోలా ఉంటాయి. నిహారికకు ఇదే శాపంగా కూడా మారుతుంది. హీరోయిన్ గా సత్తా చాటాలని చూస్తున్న ఈ ముద్దుగుమ్మకు లక్ కలిసి రావడం లేదు. కథ కరెక్ట్ గానే వస్తున్నా.. అది తెరపైకి వచ్చేసరికి మరోలా తేలిపోతుంది. ఇప్పుడు హ్యాపీవెడ్డింగ్ కు ఇదే పరిస్థితి. కొత్త దర్శకుడు లక్ష్మణ్ కార్యా తెరకెక్కించిన ఈ చిత్రం రెండ్రోజుల కిందే విడుదలైంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మెగా పవర్ చూపించాలనుకున్న నిహారికకు మరోసారి షాక్ తగిలింది. కనీసం ఓపెనింగ్స్ కూడా లేకుండానే చేతులెత్తేసింది హ్యాపీవెడ్డింగ్. యువీ క్రియేషన్స్ బ్యానర్ నుంచి వచ్చిన తొలి ఫ్లాప్ సినిమా ఇదే. పెళ్లి గురించి చెప్పినా.. మరీ సీరియల్ గా సాగదీయడంతో మంచి కథ కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టేసింది. పైగా ప్రతీసారి విజయవాడ టాపిక్ తీసుకొచ్చి కథను కామెడీ చేసారు. కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లు హ్యాపీవెడ్డింగ్ కు కూడా అంతే. ఒక్క సీన్ ఏదో బాగుంది అనుకునేలోపు మరో చెత్త సీన్ వస్తుంది. నిహారిక హీరోయిన్ గా సక్సెస్ కావాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. మరి ఆ అద్భుతాన్ని ఆవిష్కరించే దర్శకుడు ఎక్కడున్నాడో చూడాలిక.. 
 

More Related Stories