English   

ఎన్టీఆర్ ఏమో కానీ ఏఎన్నార్ వ‌స్తున్నాడు.. 

ANR-Biopic

ఎన్టీఆర్ బ‌యోపిక్ పై ఇండ‌స్ట్రీలో ఇప్పుడు చాలా చ‌ర్చ‌లే జ‌రుగుతున్నాయి. ఈ చిత్రం ఆగ‌స్ట్ నుంచి ప‌ట్టాలెక్కుతుంద‌ని.. వ‌చ్చే జ‌న‌వ‌రికి వ‌చ్చేస్తుంద‌ని ఏదేదో చెప్పాడు బాల‌య్య‌. కానీ ఇప్పుడు అంతా ఆగిపోయింది. తేజ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. దాంతో ఎన్టీఆర్ బ‌యోపిక్ ఉంటుందో లేదో ఇప్పుడు క్లారిటీ లేదు. కానీ ఎన్టీఆర్ కంటే ముందు ఇప్పుడు ఏఎన్నార్ బ‌యోపిక్ వ‌స్తుంద‌ని తెలుస్తుంది. ఈ చిత్రం కోసం చాలా సైలెంట్ గా అన్న‌పూర్ణ స్టూడియోస్ స్క్రిప్ట్ రెడీ అవుతుంద‌ని తెలుస్తుంది. అన్న‌పూర్ణ ఫిల్మ్ స్కూల్ పిల్ల‌లే ఏఎన్నార్ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నార‌ని.. ఇందులో యంగ్ నాగేశ్వ‌ర‌రావ్ గా నాగ‌చైత‌న్య‌.. ముస‌లి ఏఎన్నార్ గా నాగార్జున న‌టిస్తార‌ని తెలుస్తుంది. ఇదే నిజ‌మైతే గ‌న‌క స‌రికొత్త సంచ‌ల‌నానికి తెర తీసిన‌ట్లే. అయితే ఎన్టీఆర్ జీవితంతో పోలిస్తే ఏఎన్నార్ జీవితంలో అంతగా ఆస‌క్తి క‌లిగించే అంశాలేవీ లేవు. కాంట్ర‌వ‌ర్సీల‌కు దూరంగా ఉన్నాడు నాగేశ్వ‌ర‌రావ్. మ‌రి ఈ క‌థ అన్న‌పూర్ణ కంపౌండ్ లో ఎలా సిద్ధ‌మ‌వుతుందో చూడాలిక‌..!

More Related Stories