English   

ద‌స‌రా ముందే అంత‌రిక్ష ప్ర‌యాణం

Antariksham-Teaser
2018-10-15 19:27:11

వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న కొత్త సినిమా అంత‌రిక్షం. అదితిరావు హైద‌రి, లావ‌ణ్య త్రిపాటి హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ మూవీకి ఘాజీ ఫేమ్ సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ఘాజీతో దేశ‌వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంక‌ల్ప్ కు ఇదిరెండో సినిమా. అయినా త‌న  మూవీపై మ‌రోసారి క్రేజ్ పెంచ‌డంలో సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడ‌త‌ను. ఇక స్పేస్ బ్యాక్ డ్రాప్ లో వ‌స్తోన్న ఫ‌స్ట్ తెలుగు మూవీ ఇది. ఇంత‌కు ముందు దేశ‌వ్యాప్తంగా ఓ త‌మిళ సినిమా మాత్ర‌మే వ‌చ్చింది. జ‌యం ర‌వి  హీరోగా న‌టించిన ఆ మూవీ రీసెంట్ గా విడుదలైంది. కానీ స్పేస్ బ్యాక్ డ్రాప్ అన్న క్యూరియాసిటీకి త‌గ్గ ఫీల్ ఇవ్వ‌లేద‌నే చెప్పాలి. దీంతో ఆల్రెడీ ఘాజీతో సీ బ్యాక్ డ్రాప్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన న్యూ టాలెంట్ సంక‌ల్ప్ సినిమాపై ఆడియ‌న్స్ లో మంచి అంచ‌నాలున్నాయి. వాటిని అందుకోవ‌డానికి ఈ డిసెంబ‌ర్ 21న రాబోతున్నారు. 

అంత‌రిక్షం సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్  అందరినీ ఆక‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ద‌స‌రాకు ఆడియ‌న్స్ కు స్పెష‌ల్ ట్రీట్ ఇవ్వ‌బోతోంది అంత‌రిక్షం టీమ్. ఈ నెల 17న సాయంత్రం 4 గంట‌ల‌కు టీజ‌ర్ విడుద‌ల చేయ‌బోతున్నారు. దీంతో ఈ మూవీ రేంజ్ ఎలా ఉండ‌బోతోంద‌నే ఓ అంచ‌నాకు రావ‌చ్చు.  తొలి ప్రేమ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత వ‌రుణ్ చేస్తోన్న ఈ మూవీ హీరోగా అత‌ని రేంజ్ నుపెంచుతుంద‌ని కూడా చెప్పొచ్చు. మ‌రి ఈ టీజ‌ర్ తో సంకల్ప్ ఎలాంటి ఫీల్ ఇస్తాడో చూడాలి.

More Related Stories