English   

డైరెక్టర్ తో అనూ ఇమాన్యుయేల్ డేటింగ్

Anu Emmanuel
2021-02-20 12:29:21

మజ్ను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ అనూ ఇమాన్యుయేల్ ఆ తరవాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీ అయ్యింది. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ ల సరసన సైతం నటించి అలరించింది. ఇక ప్రస్తుతం ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న "మహా సముద్రం" సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా అనూ ఇమాన్యుయేల్ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆక్సిజన్ సినిమా దర్శకుడు ఎ.ఎమ్ జ్యోతి కృష్ణ తో డేటింగ్ లో ఉందని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆక్సిజన్ సినిమా సమయంలో అనూ జ్యోతి కృష్ణ క్లోజ్ అయ్యారట. 2017 లో ఈ సినిమా రాగా..అప్పటి నుండి ఇప్పటి వరకు ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ స్ట్రాంగ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. జ్యోతి కృష్ణ ఎవరో కాదు...ప్రముఖ నిర్మాత ఏ ఎమ్.రత్నం కుమారుడు..అంతే కాకుండా 7/జి బృందావన కాలనీ హీరో రవికృష్ణ సోదరుడు. ఇక ఈ మ్యాటర్ పై అనూ ఎలా స్పందిస్తుందో చూడాలి.

More Related Stories