English   

అను ఆశ‌ల‌న్నీ ఇప్పుడు అల్లుడుపైనే..!

Anu-Emmanuel
2018-05-24 20:19:02

అస‌లే కెరీర్ ఎటు పోతుందో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఉంది అను ఎమ్మాన్యువ‌ల్. ఆశ‌లు పెట్టుకున్న అజ్ఞాత‌వాసి కాస్తా కెరీర్ ను మ‌రింత అజ్ఞాతంలోకి తీసుకెళ్లాడు. ఇక ఆక్సీజన్ అందకుండానే ఆవిరైపోయింది. ఇలాంటి టైమ్ లో స్టార్ ఇమేజ్ తెస్తుంద‌నుకున్న నా పేరు సూర్య కాస్తా అడ్ర‌స్ లేకుండా పోయింది. అందులోనూ అందులో అను పాత్ర అస్స‌లేమాత్రం లేదు. అలా అప్పుడ‌ప్పుడూ పాట‌ల్లో వ‌చ్చెళ్ల‌డం త‌ప్ప‌. దాంతో బ‌న్నీ ఏ విధంగానూ అను ఎమ్మాన్యువ‌ల్ కెరీర్ కు హెల్ప్ కాలేదు. దాంతో ఈ కేర‌ళ‌కుట్టికి పెద్ద షాక్ త‌గిలింది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి రెండేళ్ళ‌వుతున్నా ఈ భామ కెరీర్ గాడిన ప‌డేంత సినిమా ఒక్క‌టి ప‌డ‌లేదు. మ‌జ్ను చేసినా అందులో క్రెడిట్ అంతా నాని తీసుకెళ్లిపోయాడు. పోనీ బ‌న్నీ మాయ చేస్తాడేమో అనుకుంటే మామ మాదిరే ముంచేసి వెళ్లిపోయాడు. దానికితోడు బంప‌ర్ ఆఫ‌ర్ కింద ర‌వితేజ‌తో న‌టించాల్సిన అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ నుంచి త‌ప్పుకుంది ఈ ముద్దుగుమ్మ‌. కార‌ణం అడిగితే ప‌ర్స‌న‌ల్ అంటుంది. దాంతో ఇప్పుడు ఆశ‌ల‌న్నీ శైల‌జారెడ్డి అల్లుడుపైనే ఉన్నాయి. నాగ‌చైత‌న్య హీరోగా వ‌స్తోన్న ఈ చిత్రాన్ని మారుతి తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఇది కానీ తేడా కొడితే అను దుకాణం టాలీవుడ్ లో ముగిసిపోయిన‌ట్లే..!

More Related Stories