English   

రవితేజ సినిమా వదులుకున్న బ్యూటీ 

Anu-Emmanuel
2018-05-21 11:52:02

డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదు.. పాపం ఈ ప్రాబ్లమ్ వల్ల ఒక్కోసారి హీరోయిన్లు చాలా లాస్ అవుతుంటారు. అలాగే కొన్నిసార్లు గెయిన్ అవుతుంటారు కూడా. డేట్స్ అడ్జెస్ట్ కాక తప్పుకున్న కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ కావొచ్చు. అలాగే డిజాస్టర్స్ కావొచ్చు. అందుకే ఈ మాట ఎప్పుడూ డిఫరెంట్ గానే ఉంటుంది. లేటెస్ట్ గా మాస్ మహరాజ్ రవితేజ సినిమా నుంచి ఇదే ప్రాబ్లమ్ తో తప్పుకుంది అజ్ఙాత వాసి అందం అనూ ఇమ్మానుయేల్. యస్.. శ్రీను వైట్ల డైరెక్షన్ లో వస్తోన్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా అనూ ఇమ్మానుయేల్ నే తీసుకున్నారు. కానీ అమ్మడు ఆసినిమా నుంచి తాను తప్పుకున్నట్టు తేల్చేసింది. అనూ అమర్ అక్బర్ ఆంటోనీ కంటే ముందే నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తోన్న శైలాజా రెడ్డి అల్లుడు సినిమాకు కమిట్ అయింది. కానీ ఆ సినిమా కాస్త లేట్ అయింది. ఈ లోగా తను రవితేజ సినిమాకూ కమిట్ అయింది. కానీ ఆ లేట్ వల్ల ఇప్పుడీ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతోందట. అందుకే ఈ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నానని ట్వీట్ చేసింది. దీంతో ఇది అమర్ అక్బర్ ఆంటోనీ టీమ్ కు ప్రాబ్లమ్ గా మారింది. ఇక అను ప్లేస్ లో శ్రుతి హాసన్ ను తీసుకోవాలని భావిస్తున్నారని టాక్. అలాగే రవితేజతో కిక్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లో నటించిన ఇలియానాను కూడా సంప్రదిస్తున్నారంటున్నారు. మరి ఈ ఇద్దరు భామల్లో అనూ స్థానం ఎవరికి దక్కుతుందో చూడాలి. 

More Related Stories