వీళ్లు కానీ హిట్ కొట్టకపోతే..!

వరస విజయాలతో ఇండస్ట్రీకి వచ్చారు ఆ ముద్దుగుమ్మలు. కానీ సడన్ గా అనుకోని ఫ్లాపులతో వెనకబడ్డారు. ఒకటి రెండు ఇలా వరసగా ఫ్లాపులు వచ్చేసరికి కెరీర్ ఎటు పోతుందో తెలియని కన్ఫ్యూజన్ లో పడిపోయారు. అనుపమ పరమేశ్వరన్ ఇందులో ముందుంది. మొన్నటి వరకు ఫుల్లుగా ఫామ్ లో ఉంది ఈ భామ. అ..ఆ, ప్రేమమ్, శతమానం భవతి లాంటి వరస విజయాలతో ఉన్న అనుపమ కెరీర్ కు ఉన్నది ఒకటే జిందగీతో బ్రేకులు పడ్డాయి. ఈ చిత్రం ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. సినిమా బాగుందనే టాక్ వచ్చినా కూడా నిలబడలేదు. మొన్న వచ్చిన కృష్ణార్జున యుద్ధం కూడా డిజాస్టర్ అయిపోయింది. దాంతో ఇప్పుడు అర్జంట్ గా హిట్ కొట్టాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సాయిధరంతేజ్ తో కరుణాకరణ్ తెరకెక్కించిన తేజ్ ఐ లవ్ యూ లో నటించింది అనుపమ. ఈ చిత్రం జులై 6న విడుదల కానుంది. ఈ సినిమాపైనే అమ్మడి ఆశలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు రామ్ సరసన హలో గురు ప్రేమకోసమేలో నటిస్తుంది అనుపమ.
అను ఎమ్మాన్యువల్ పరిస్థితి కూడా అంతే. మజ్నుతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత గోపీచంద్ ఆక్సీజన్, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిలతో డిజాస్టర్లను అందుకుంది. ఓ రకంగా ఐరెన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది అను. ఇక నా పేరు సూర్య కూడా డిజాస్టరే. ఈ సినిమాతో అను కెరీర్ కు పెద్ద గండే పడింది. దాంతో ఇప్పుడు నాగచైతన్య శైలజారెడ్డి అల్లుడు సినిమా అను కెరీర్ కు ఊపిరిగా మారింది. ఇక సాయిపల్లవి కూడా కణంతో తొలి ఫ్లాప్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో హను రాఘవపూడి పడిపడి లేచే మనసులో నటిస్తుంది పల్లవి. కీర్తిసురేష్ కూడా అజ్ఞాతవాసితో షాక్ తినేసింది. మహానటి బ్లాక్ బస్టర్ అయినా కూడా తమిళ్ లో మాత్రం ప్లాపుల్లోనే ఉంది ఈ భామ. ప్రస్తుతం అక్కడ విజయ్.. విక్రమ్.. విశాల్ లాంటి స్టార్ హీరోలతో నటిస్తుంది. ఇలా వరస విజయాలతో వచ్చి సడన్ గా ఫ్లాపుల్లో పడి ఎటూ కాకుండా ఉన్నారు ఈ ముద్దుగుమ్మలు.