English   

ఆట మొద‌లుపెట్టిన అనుప‌మ‌..

Ram-anupama

తెలుగులో ఓ సామెత ఉంటుంది. ఎక్క‌డ పోయిందో అక్క‌డే వెతుక్కోవాల‌ని. ఇప్పుడు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ చేస్తుందిదే. ఈ భామ‌కు అప్ప‌ట్లో వ‌ర‌స‌గా స్టార్స్ నుంచి ఛాన్స్ లు వ‌చ్చాయి కానీ వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారిపోయాయి. అయినా కూడా అనుప‌మ నిరాశ‌ప‌డలేదు. చిన్న హీరోల‌తోనే  న‌టిస్తూ స్టార్ హీరోయిన్ అవ్వాల‌ని చూస్తుంది. పారితోషికం కోసం కాకుండా ముందు క‌థ‌లు న‌చ్చాలంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అనుప‌మ న‌టించిన అ..ఆ.. ప్రేమ‌మ్.. శ‌త‌మానం భ‌వ‌తి.. ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ అన్నీ మంచి సినిమాలే. వీటిలో ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ మిన‌హా అన్నీ విజ‌యాలే. ఇది వ‌ర‌కు ఆమె న‌టించిన ప్రేమ‌మ్.. అ..ఆ.. శ‌త‌మానం భ‌వ‌తితో పోలిస్తే ఉన్న‌ది ఒక‌టే జింద‌గీలో అద్భుత‌మైన కారెక్ట‌ర్ లో న‌టించింది అనుప‌మ‌. త‌న మెచ్యూర్డ్ యాక్టింగ్ తో మంచి మార్కులు కొట్టేసింది. మ‌హా పాత్ర‌లో అద్భుత‌మైన ఎక్స్ ప్రెష‌న్స్ ప‌లికించింది. 

కెరీర్ లో మంచి సినిమాలున్నా కూడా ఎందుకో కానీ అనుప‌మ‌కు ఆ మ‌ధ్య అవ‌కాశాలు స‌న్న‌గిల్లాయి. దానికి కూడా అను ఏ మాత్రం కంగారు ప‌డ‌లేదు. త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాల‌నే ఒడిసి ప‌ట్టుకుంది. ఇప్పుడు చూస్తుంటే మ‌ళ్లీ ఈ కేర‌ళ‌కుట్టికి టైమ్ మొద‌లైన‌ట్లు క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే క‌రుణాక‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌రంతేజ్ తో రొమాన్స్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. దాంతోపాటు కృష్ణార్జున యుద్ధంలో నానితో జోడీ క‌ట్టింది. ఈ రెండు సినిమాలు విడుద‌ల కాక‌ముందే ఇప్పుడు మ‌రోసారి రామ్ తో న‌టించే అవ‌కాశం అందుకుంది అనుప‌మ‌. త్రినాథ‌రావ్ తెర‌కెక్కిస్తున్న హ‌లో గురు ప్రేమ‌కోస‌మేలో రామ్ స‌ర‌స‌న న‌టిస్తుంది ఈ భామ‌. ఉన్న‌ది ఒక‌టే జిందగీ ఫ్లాపైనా కూడా మ‌రోసారి అనుప‌మే కావాలంటున్నాడు రామ్. ఇలా మొత్తానికి వ‌ర‌స‌గా చిన్న సినిమాల‌తోనే రేంజ్ పెంచుకుంటుంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. 

More Related Stories