English   

 అనుప‌మ‌.. ఓ నిండు చంద‌మామ‌..!

anupama-parameswaran

కొంద‌రు హీరోయిన్లు అంతే.. మొత్తం చూపించాల్సిన ప‌నిలేదు. కాస్త న‌వ్వితే చాలు.. కొంటెగా చూసినా చాలు వాళ్ల ప్రేమ‌లో ప‌డిపోతుంటారు. అచ్చు అనుప‌మ కూడా ఇలాంటి ముద్దుగుమ్మే. ఈ భామ మాయ‌లో ప‌డాలంటే పెద్ద‌గా ఎక్స్ పోజింగ్ చేయాల్సిన ప‌నిలేదు. ఓర‌గా ఒక్క చూపు చూస్తే చాలు.. అంతా మాయ‌లో కాదు ఏకంగా మ‌త్తులోనే ప‌డిపోతారు. తాజాగా ఈ మ‌ళ‌యాల కుట్టి ఓ ఫోటోషూట్ చేసింది. సాధార‌ణంగా హీరోయిన్ల ఫోటోషూట్ అంటే ఇప్పుడు ఒక‌టే మాట‌.. అందాల‌న్నీ ఆర‌బోయ‌డం. సినిమాలు.. బ‌య‌ట అని సంబంధం లేదు. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తీ సారి అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తున్నారు ముద్దుగుమ్మ‌లు. ఇలాంటి వాళ్ల మ‌ధ్య కూడా అందాల ఆర‌బోత‌కు దూరంగా ఉంటూ స్టార్ హీరోయిన్ అనిపించుకోవాల‌ని చూస్తుంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. అందాలే ఆర‌బోయాల్సి వ‌స్తే ఇంటికి వెళ్లిపోతానంటుంది కానీ గ్లామర్ షో మాత్రం చేయ‌న‌ని తెగేసి చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. 

అంతెందుకు ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం న‌డుము కూడా చూపించ‌లేదు అనుప‌మ‌. తాజాగా విడుద‌లైన ఫోటోషూట్ లో కూడా కేవ‌లం కాళ్లు మాత్ర‌మే చూపిస్తూ చ‌క్క‌గా క‌వ్వించింది ఈ ముద్దుగుమ్మ‌. నిండా క‌ప్పుకుని అమ్మ‌డు చేసిన ఫోటోషూట్ ఇప్పుడు ఆక‌ట్టుకుంటుంది. అంతా అందాల ఆర‌బోత‌లో బిజీగా ఉంటే అనుప‌మ మాత్రం అందంగా ఆక‌ట్టుకుంటుంది. ఫోటోషూట్ అంటే కేవ‌లం అందాలు ఆర‌బోయ‌డ‌మే కాదు.. ఇలా కూడా చేయొచ్చు.. నిండా క‌ప్పుకుంటే కూడా అందంగా ఉంటారు అని కొత్త‌గా నిరూపించింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. ప్ర‌స్తుతం ఈ భామ సినిమాల విష‌యంలోనూ దూకుడు చూపిస్తుంది. ప్ర‌స్తుతం క‌రుణాక‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌రంతేజ్ హీరోగా న‌టిస్తున్న సినిమాలో.. కృష్ణార్జున యుద్ధంలో నానితో క‌లిసి.. రామ్-త్రినాథ‌రావ్ హ‌లో గురు ప్రేమ‌కోస‌మే సినిమాల్లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంది. మొత్తానికి ఇప్పుడు ఫోటోషూట్ ల‌కు కొత్త అర్థం చెప్పి ఆక‌ట్టుకుంటుంది అనుప‌మ‌. 

More Related Stories