English   

వీళ్ల‌కు అర్జంట్ గా హిట్ కావాలంట‌.. 

anupama-saipallavi

వ‌ర‌స విజ‌యాల‌తో ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు ఆ ముద్దుగుమ్మ‌లు. కానీ స‌డ‌న్ గా అనుకోని ఫ్లాపుల‌తో వెన‌క‌బ‌డ్డారు. ఒక‌టి రెండు ఇలా వ‌ర‌స‌గా ఫ్లాపులు వ‌చ్చేస‌రికి కెరీర్ ఎటు పోతుందో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్ లో ప‌డిపోయారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇందులో ముందుంది. మొన్న‌టి వ‌ర‌కు ఫుల్లుగా ఫామ్ లో ఉంది ఈ భామ‌. అ..ఆ, ప్రేమ‌మ్, శ‌త‌మానం భ‌వ‌తి లాంటి వ‌ర‌స విజ‌యాల‌తో ఉన్న అనుప‌మ కెరీర్ కు ఉన్న‌ది ఒక‌టే జింద‌గీతో బ్రేకులు ప‌డ్డాయి. ఈ చిత్రం ఊహించ‌ని విధంగా ఫ్లాప్ అయింది. సినిమా బాగుంద‌నే టాక్ వ‌చ్చినా కూడా నిల‌బ‌డ‌లేదు. మొన్న వ‌చ్చిన కృష్ణార్జున యుద్ధం కూడా డిజాస్ట‌ర్ అయిపోయింది. దాంతో ఇప్పుడు అర్జంట్ గా హిట్ కొట్టాల‌ని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం సాయిధ‌రంతేజ్ తో క‌రుణాక‌ర‌ణ్ తెర‌కెక్కిస్తోన్న తేజ్ ఐ ల‌వ్ యూ లో న‌టిస్తుంది అనుప‌మ‌. ఈ సినిమాపైనే అమ్మ‌డి ఆశ‌లు ఉన్నాయి. 

అను ఎమ్మాన్యువ‌ల్ ప‌రిస్థితి కూడా అంతే. మ‌జ్నుతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత గోపీచంద్ ఆక్సీజ‌న్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసిల‌తో డిజాస్ట‌ర్ల‌ను అందుకుంది. ఓ ర‌కంగా ఐరెన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది అను. ప్ర‌స్తుతం నా పేరు సూర్య‌తో వ‌చ్చింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ చిత్రం అను కెరీర్ ను డిసైడ్ చేయ‌నుంది. దీంతోపాటు ర‌వితేజ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.. నాగ‌చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు సినిమాల్లో న‌టిస్తుంది అను. ఇక సాయిప‌ల్ల‌వి కూడా క‌ణంతో తొలి ఫ్లాప్ అందుకుంది. ప్ర‌స్తుతం తెలుగులో హ‌ను రాఘ‌వ‌పూడి ప‌డిప‌డి లేచే మ‌న‌సులో న‌టిస్తుంది ప‌ల్ల‌వి. కీర్తిసురేష్ కూడా అజ్ఞాత‌వాసితో షాక్ తినేసింది. మ‌హాన‌టిపై ఈమె ఆశ‌ల‌న్నీ ఉన్నాయి. ఇలా వీళ్లంద‌రికీ ఇప్పుడు అర్జంట్ గా ఓ హిట్ ప‌డాల్సిందే. లేదంటే లేనిపోని క‌ష్టాలు వ‌చ్చేస్తాయి.

More Related Stories