English   

నో గ్లామ‌ర్.. ఓన్లీ యాక్ష‌న్..

Anupama and Sai pallavi and  Niveda thomos

ఈ రోజుల్లో స్టార్ హీరోయిన్ అవ్వాలంటే అందాలు ఆర‌బోయ‌కుండా సాధ్య‌మేనా..? అస‌లు అవ‌కాశాలు కూడా రావు క‌దా.. అందాలు ఆర‌బోయ‌క పోతే.. అలాంటిది స్టార్స్ ఎలా అవుతారు అనుకుంటున్నారా..? కానీ ఇప్పుడు ఇది ఇండ‌స్ట్రీలో జ‌రుగుతుంది. గ్లామ‌ర్ రాజ్య‌మేలుతున్న మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలోనే ఇప్పుడు ఈ విచిత్రం జ‌రుగుతుంది. కొంద‌రు ముద్దుగుమ్మ‌లు అందాల ఆర‌బోత‌కు దూరంగా ఉంటూనే స్టార్ హీరోయిన్లుగా మారిపోతున్నారు. సౌంద‌ర్య జ‌మానాతోనే అభిన‌యానికి రోజులు చెల్లిపోయాయి అనుకున్న టైమ్లో ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు మారుతున్నాయి. గ్లామ‌ర్ షో చేయ‌కుండా కూడా స్టార్ హీరోయిన్లు అవ్వొచ్చ‌ని కొంద‌రు ముద్దుగుమ్మ‌లు నిరూపిస్తున్నారు. ఫిదాతో సాయిప‌ల్ల‌వి ఏదో మాయ చేస్తుంది. ఈ సినిమాలో ఈమె అందాలేం ఆర‌బోయ‌లేదు. కానీ స్టార్ ఇమేజ్ వ‌చ్చింది.

ఇక ఎంసిఏతో అమ్మాయిగారి రేంజ్ ఆకాశానికి వెళ్లిపోయింది. ఇప్పుడు సాయిప‌ల్ల‌వి అనే పేరు కాదు ఓ బ్రాండ్. ఇక కీర్తిసురేష్ గురించి ఏం చెప్పాలి..? ఈ భామ ఇప్ప‌టి వ‌ర‌కు న‌డుము కూడా చూపించ‌లేదు. కానీ స్టార్స్ నువ్వే కావాలంటూ వెంట ప‌డుతున్నారు. నివేదా థామ‌స్ కూడా అంతే. నిన్నుకోరి, జెంటిల్ మ‌న్ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌డేసింది నివేదా. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా అందాల ఆర‌బోత‌కు దూర‌మే. ఇప్పుడు ఈ భామ నాని కృష్ణార్జున యుద్ధం.. సాయిధ‌రంతేజ్ క‌రుణాక‌ర‌ణ్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. రామ్ తో మ‌రో సినిమాకు సైన్ చేసే యోచ‌న‌లో ఉంది అనుప‌మ‌. ఈ ముద్దుగుమ్మ‌లంతా గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో ఉంటూ కూడా త‌న ప‌ద్దతుల్లోనే న‌టిస్తున్నారు. నిజంగా గ్రేట్ క‌దా.. ఇంత కాంపిటీష‌న్ లో కూడా ఇలాంటి హీరోయిన్లు ఉండ‌టం..!

More Related Stories