English   

అనురాగ్ కశ్యప్ కూతురికి రేప్ చేస్తామంటూ బెదిరింపులు

Alia Kashyap
2021-02-19 14:14:54

సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు కొన్నిసార్లు ప్రతికూల కామెంట్స్ రావడం సహజమే. కానీ కొన్ని సందర్భాల్లో ఆకతాయిలు హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. ఇటీవల బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు..ఆలియా కశ్యప్ కు కూడా అలాంటి చేదు అనుభావమే ఎదురైందట. ఆలియా ఎప్పుడూ సోషల్  మీడియా చురుగ్గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఓ సెలబ్రెటీ కూతురు కావడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అలచనలో ఉందో ఏమో గాని గ్లామర్ డోస్ పెంచేసి లో దుస్తులతో దిగిన ఫోటోలను షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలు కారణంగా తనను కొందరు నెటిజన్లు బెదిరించారని తాజాగా ఓ వీడియోలో వెల్లడించింది. 

తన యూట్యూబ్ ఛానల్ లో అలియా మాట్లాడుతూ...సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ తో నేను ఎంత సున్నితమైన వ్యక్తినో నాకు అర్థమైంది. నా ఫోటోలను షేర్ చేస్తే కొంతమంది నన్ను "వేశ్య లాగా భావిస్తూ కామెంట్స్ చేస్తున్నారు..నీ రేటు ఎంత అని  మెసేజ్ లు పెడుతున్నారు. నేను భారతీయురాలిని కావడంతో ఈ పోస్టు చేసినందుకు సిగ్గుపడాలని నాకు సలహాలు ఇస్తున్నారు. దీనికి నేను చాలా భాధపడ్డాను. ఎన్నోసార్లు ఏడ్చాను. కానీ ఆ తరవాత ముక్కు ముఖం తెలియని వాడు అన్నదానికి ఎందుకు భాదపడాలని అనుకున్నా. అలాంటి వాళ్ల అకౌంట్స్ అన్నీ బ్లాక్ చేసాను. ఇక ఇప్పుడు నా ఖాతా లో పాజిటివిటి మాత్రమే ఉంటుంది" అంటూ అలియా ఆవేదన వ్యక్తం చేసింది.

More Related Stories