English   

తన ఫేవరెట్ హీరోతో మరోసారి అనుష్క..?

Anushka
2018-08-04 19:06:08

తనకు బాగా నచ్చిన హీరోతో అనుష్క మరోసారి రొమాన్స్ చేయబోతోందా..? ఆ హీరో అంటే అమ్మడికి చాలా ఇష్టం అని చాలామందికి తెలుసు. అలాంటి హీరోతో పాటు ఆ హీరోకు తిరుగులేని బ్రేక్ ఇచ్చిన దర్శకుడితో ఈ భామ సినిమా చేస్తోందా అంటే అవుననే వినిపిస్తోంది. అయితే దీనికంటే ముందు ‘‘అనుష్క’స్ ఐస్’’ అనే సినిమా కూడా చేస్తుందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఇది ఓ స్పానిష్ మూవీకి రీమేక్ అంటున్నారు. స్పానిష్ లో ఆ సినిమా పేరు ‘‘జూలియాస్’స్ ఐస్’. ఆ సినిమాకు అనుష్క పేరు తగిలించి ఇక్కడ రీమేక్ చేస్తారంటున్నారు. దీనికి టాప్ సినిమాటోగ్రాఫర్ కబిర్ లాల్ డైరెక్షన్ చేస్తాడనే మాటలూ వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ గా ఇంకా ఏ వార్తా రాలేదు. కానీ గాసిప్స్ వినిపిస్తున్నాయి.  ఒక వేళ ఈ సినిమా ఉన్నా లేకపోయినా.. అనుష్క మాత్రం తన ఫేవరెట్ హీరోతో సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. 

అనుష్క ఫేవరెట్ హీరో సూర్య. కోలీవుడ్ లో తనతో కలిసి కొన్ని సినిమాలు చేసింది. అలాగే సూపర్ హిట్ సిరీస్ సింగంలో కూడా అమ్మడు అన్ని పార్ట్స్ లోనూ కనిపిస్తుంది. త్వరలోనే ఈ సింగం కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. అంటే ‘సింగం-4’అన్నమాట.  అయితే ఈ పార్ట్ కు సంబంధించి కాస్త థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం. రీసెంట్ గా దర్శకుడు హరి అనుష్కకు కథ వినిపించాడు. అది తనకు బాగా నచ్చిందట. ఈ విషయాన్ని దర్శకుడు హరినే చెప్పాడు. ప్రస్తుతం హరి విక్రమ్ తో సామికి సీక్వెల్ గా సామి స్క్రేర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటు సూర్య కూడా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ‘ఎన్.జి.కె’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే మరోసారి సింగం టీమ్ టై అప్ అవుతుందట. సో.. వీటిని బట్టి స్వీటి తన ఫేవరెట్ హీరోతో రొమాన్స్ కు మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. అయితే ఆ స్పానిష్ మూవీ, ఇది.. వీటిలో ఏది ముందు స్టార్ట్ అవుతుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.. 

More Related Stories