English   

అనుష్కతో ముంబైలో పార్టీ చేసుకున్న పూరీ జగన్నాథ్ పార్ట్ నర్..

puri
2019-12-08 07:06:40

భాగమతి సినిమా తర్వాత కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అనుష్క శెట్టి మళ్లీ ఇప్పుడు నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది. హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మాధవన్ హీరోగా నటించాడు. తెలుగుతో పాటు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో కూడా నిశ్శబ్దం సినిమా విడుదల అవుతుంది. కోన వెంకట్ ఈ సినిమాకు నిర్మాత. ఈ చిత్ర షూటింగ్ పూర్తికావడంతో మళ్లీ ఎంజాయ్ మూడ్ లోకి వెళ్ళిపోయింది అనుష్క. తాజాగా ముంబైలో మరో హీరోయిన్ కం ప్రొడ్యూసర్ ఛార్మి కౌర్ తో పార్టీ చేసుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ మధ్య చార్మి నటనకు పూర్తిగా సెలవు ఇచ్చేసింది. ఇకపై తాను నటించదలుచుకోలేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది కూడా. పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ అంటూ ఒక నిర్మాణ సంస్థ నెలకొల్పి అందులోనే వరుసగా సినిమాలు చేస్తోంది ఛార్మి.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఇద్దరూ అదిరిపోయే బ్లాక్ బస్టర్ కూడా అందుకున్నారు. ఇప్పుడు అదే జోరులో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమాకు ముహూర్తం పెట్టారు చార్మీ, పూరీ జగన్నాథ్. ఆ సినిమాకు ఇంకా టైం ఉండటంతో ప్రస్తుతం పార్టీ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే బాంబేలో అనుష్క శెట్టిని కలిసింది. ఇద్దరూ కలిసి బాగానే ఎంజాయ్ చేశారు. ఇద్దరికీ సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇందులో అనుష్క శెట్టి కూర్చొని ఉంటే ఆమె భుజంపై చేయి వేసి వెనకనుంచి నవ్వుతూ నిలుచుంది ఛార్మి. ఈ ఫోటో చూసిన తర్వాత అభిమానులు కూడా ఇద్దరూ భలే కలిసారే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

More Related Stories