English   

అనుష్కను అలా వదిలేసినట్టేనా ఇంక..

Anushka-Shetty
2018-06-28 09:21:14

నిన్నటి వరకూ బ్యూటీ క్వీన్. మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్. ఇండియాలోనే ది బెస్ట్ మూవీలో మెయిన్ హీరోయిన్.. కానీ ఇప్పుడు అనుష్క గురించి ఆరాలు తీసేవారు కూడా లేరు. కారణం తన పర్సనాలిటీయే. అవును.. అనుష్క ఇప్పుడు ఏం చేస్తోంది.. ఎక్కడుంది.. ఎలా ఉంది అనే విషయాలు మీడియా కూడా పట్టించుకోవడం మానేసింది. అంటే ఇక అనుష్కను వదిలేసినట్టేనా.. పైగా ఇప్పుడు ప్రభాస్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆమె గురించే తెలియడం లేదు. అంటే ప్రభాస్ ఏదైనా ఫంక్షన్ కు అటెండ్ అవుతే తను కూడా వస్తుంది కదా అని.. మొత్తంగా బాహుబలి తర్వాత ఆమె చేసిన సైజ్ జీరో అనుష్క పాలిట శాపంగా మారింది. ఆ సినిమా కోసం పెంచిన ఫిజిక్ ను తగ్గించలేక నానా ఇబ్బందులూ పడింది. బాహుబలి రెండో పార్ట్ కోసం ఖచ్చితంగా తగ్గాలని అల్టిమేటం జారీ చేసింది మూవీ టీమ్. అయినా తగ్గలేకపోయింది. మరోవైపు అనుష్కకు థైరాయిడ్ వచ్చిందనే రూమర్స్ కూడా వచ్చాయి. ఇటు బరువు తగ్గకపోవడంతో అది నిజమే అనుకున్నారు చాలామంది. మొత్తంగా బాహుబలి-2ను ఫినిష్ చేసింది. తర్వాత ఆల్రెడీ ఒప్పుకున్న భాగమతితో మరో హిట్ అందుకుని ఆ తర్వాత మొహం చాటేసింది. కొన్నాళ్లు ప్రభాస్ ను పెళ్లి చేసుకోబోతోంది అనే రూమర్స్ వినిపించినా.. ఇప్పుడు అవీ ఆగిపోయాయి. లైమ్ లైట్ లో ఉంటేనే పట్టించుకునే మీడియా ఇప్పుడు స్వీటీని గురించి మాట్లాడ్డమే మానేసింది. ఏదేమైనా ఇప్పుడు అనుష్క ఏం చేస్తోంది అనే కంటే.. ఇక ఆమె హవా ముగిసినట్టే అనేది మాత్రం క్లియర్ గా తేలిపోయినట్టే.. ఫ్యూచర్ లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ తో వస్తే తప్ప ఇక ఈ గ్లామర్ ప్రపంచంలో ఇక అనుష్క కెరీర్ కు ఫుల్ స్టాప్ పడ్డట్టే అనుకోవచ్చు. 

More Related Stories