English   

అనుష్క నెక్ట్స్ భానుమతి..?

anushka shetty bhanumathi ramakrishna
2018-02-19 19:14:11

అనుష్క.. సెలెక్టివ్ రోల్స్ తో దూసుకుపోతోన్న బ్యూటీ. వరుసగా సినిమాల చేయడం ఎప్పుడో తగ్గించుకున్న స్వీటీ తనకు స్క్రిప్ట్ నచ్చితే చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఎప్పటి నుంచో చెబుతన్నారు. కాకపోతే ఇప్పుడు పెరిగిన తన పర్సనాలిటీ వల్ల రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్స్ కు సూట్ కాదు. అందుకే తనే ప్రధాన పాత్రగా ఉంటే క్యారెక్టర్స్ చేయడానికి రెడీగా ఉంది. అయితే లేటెస్ట్ గా టాలీవుడ్ లో ఓ రూమర్ హల్ చల్ చేస్తోంది. అరుంధతి భానుమతిగా మారబోతోందనేదే ఆ వార్త. 
అశ్వనీదత్ అల్లుడు, ఎవడే సుబ్రహ్మణ్యం ఫేమ్ నాగ అశ్విన్ ప్రస్తుతం మహానటి సావిత్రి బయోపిక్ ను తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఈ మూవీలో అలనాటి భానుమతి గా అనుష్కను తీసుకున్నారనీ.. అందుకు తనూ ఒప్పుకుందనేదేఆ రూమర్స్ సారాంశం. నిజానికి భానుమతి పాత్రలో అనుష్క బాగానే ఫిట్ అవుతుంది. తొలినాళ్లలో భానుమతి కూడా స్లిమ్ గానే ఉన్నా తర్వాత తనూ ఇప్పుడు అనుష్క ఉన్న పర్సనాలిటీలోనే ఎక్కువగా కనిపించారు. ఇప్పటికే మహానటిపై మెల్లగా అంచనాలు పెంచుతున్నారు. మరి అనుష్క నిజంగానే భానుమతి పాత్ర చేయడానికి ఒప్పుకుంటే ఖచ్చితంగా మహానటికి స్వీటీ బిగ్గెస్ట్ అసెట్ అవుతుందని వేరే చెప్పక్కర్లేదు.

ఇక ఈ సినిమాలో సావిత్రి భర్త జెమినీ గణేశన్ గా మళయాల యంగ్ సూపర్ స్టార్ దుల్కర్ సాల్మన్ నటిస్తున్నాడు. ఎస్వీఆర్ గా మోహన్ బాబు ఇతర ప్రధాన పాత్రల్లో ప్రకాష్ రాజ్, సమంత, విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. మరి వారి సరసన అనుష్క పేరు కూడా చేరుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. 
 

More Related Stories