English   

అనుష్క సైలెన్స్...ఈ ఏడాది చివర్లో వీడుతుందట !

anushka shetty upcoming movie will be shoot in america
2019-01-12 22:47:00

గ‌త ఏడాది మొద‌ట్లో భాగ‌మ‌తి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అలరించిన కన్నడ కుట్టి అనుష్క ఈ మధ్య ఏ సినిమా ఒప్పుకోలేదు. తాజాగా ఆమె ఓ సినిమాకి సైన్ చేసిందని తెలుస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకుడిగా తెరకెక్కించనున్న ఈ థ్రిల్లర్ మూవీ లో అనుష్క , మాధవన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్నారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఈ సినిమాకి కోన వెంకట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఆయన నిర్మాతగా తీసిన గీతాంజలి జానర్ లోనే ఈ సినిమా కూడా ఉండనుంది. అలాగే కధా పరంగా షూట్ ఎక్కువ భాగం అమెరికాలో జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది. ఈ చిత్రంలో హాలీవుడ్ న‌టులు కూడా న‌టిస్తార‌ని స‌మాచారం. అలాగే ఈ సినిమాకి సైలెన్స్ అనే టైటిల్ పరిశీలిస్తున్న‌ట్టు సమాచారం. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఈ సినిమాని ఒకేసారి రూపొందించి రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్య ఎక్కడా పెద్దగా కనిపించకుండా ఉన్న నటుడు  సుబ్బరాజు కూడా చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మార్చి నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని అంటున్నారు.  అలాగే ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల ఉంటుందట.

More Related Stories