English   

చిరు కోరిక తీరుస్తున్న అనుష్క‌..

anushka-chiru
2018-08-08 17:40:41

చిరంజీవి సినిమా అంటే అంచ‌నాలెలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. పైగా ప‌దేళ్ల త‌ర్వాత వ‌చ్చిన ఖైదీ నెం.150 సినిమాతోనూ రికార్డులు సృష్టించాడు మెగాస్టార్. ఇక ఇప్పుడు ఈయ‌న సైరా అంటూ 200 కోట్ల సినిమాతో వ‌స్తున్నాడు చిరంజీవి. దాంతోపాటు మ‌రో రెండు సినిమాలకు కూడా సై అనేసాడు ఈ హీరో. కొర‌టాల శివతో పాటు బోయ‌పాటి శీను సినిమాల‌కు కూడా ఈయ‌న క‌మిట‌య్యాడు. ఇందులో కొర‌టాల సినిమా వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి ప‌ట్టాలెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. చ‌ర‌ణ్ మ‌రో నిర్మాత‌. చిరంజీవి ఇమేజ్ కు త‌గ్గ‌ట్లుగానే సందేశాత్మ‌క క‌థ‌తోనే వ‌స్తున్నాడు కొర‌టాల శివ‌. 

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుష్క‌ను తీసుకుంటున్న‌ట్లు తెలుస్తుంది. చిరంజీవికి ఇప్పుడు జోడీగా న‌టించాలంటే అనుష్క‌ను మించిన ఆప్ష‌న్ అయితే లేదు. పైగా ఖైదీ నెం.150 నుంచే అనుష్క కోసం ట్రై చేస్తున్నాడు మెగాస్టార్. కానీ అప్పుడు ఆమె ఉన్న బిజికీ చిరు ఆఫ‌ర్ కాద‌న‌క త‌ప్ప‌లేదు. ఇప్పుడు కొర‌టాల సినిమాలో మాత్రం జేజ‌మ్మే చిరుతో జోడీక‌ట్ట‌డం ఖాయ‌మైపోయింది. పైగా మిర్చితో అనుష్క‌కు భారీ హిట్టిచ్చాడు కొర‌టాల శివ‌. అప్ప‌ట్లో స్టాలిన్ సినిమాలో ఐటం సాంగ్ చేసింది అనుష్క‌. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది ఈ ముద్దుగుమ్మ‌. కొర‌టాల సినిమా త‌ర్వాతే బోయ‌పాటి లైన్ లోకి రానున్నాడు.

More Related Stories