English   

అనుష్క, గోపీచంద్ లక్ష్యం నెరవేరుస్తుందా..?

Anushka-gopichand
2018-05-18 17:49:09

అనుష్క, గోపీచంద్ మధ్య కెమిస్ట్రీ బావుంటుంది. ఈ ఇద్దరూ కలిసి నటించిన లక్ష్యం, శౌర్యం సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాల టైమ్ లో గోపీచంద్ కెరీర్ లో ఓ రేంజ్ లో ఉంది. అంతే కాదు..ఈ రెండు సినిమాల్లోనూ అనుష్క ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. ఆ టైమ్ లో ఈ ఇద్దరి మధ్యా ఏదో ఉందంటూ కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. అవన్నీ పక్కనబెట్టి గోపీచంద్ పెళ్లి చేసుకున్నాడు. అయితే తర్వాత వీరి కెరీర్ డిఫరెంట్ గా సాగింది. అనుష్క టాప్ హీరోయిన్ అయిపోతే.. గోపీచంద్ ఫ్లాప్ హీరో అయిపోయాడు. శౌర్యం తర్వాత గోపీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. 

ఇప్పుడు అనుష్క బాహుబలితో ఇంటర్నేషనల్ లెవల్లో ఫేమ్ అయింది. ఇటు గోపీచంద్ సినిమా చేస్తే విడుదలవుతుందా అనే స్టేజ్ కు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారంటే ముందు ఆశ్చర్యం కలుగుతుంది.. ఆ తర్వాత అదెలా సాధ్యమైందా అనే అనుమానం వస్తుంది. అవన్నీ పక్కన బెడితే నిజంగా ఇప్పుడు వినిపిస్తోన్న వార్త నిజమే అయితే కనుక ఖచ్చితంగా ఇది గోపీచంద్ కు బిగ్గెస్ట్ ప్లస్ అవుతుంది. అటు అనుష్కకూ మెమరబుల్ మూవీ అవుతుంది. 

ఇంతకీ ఈ ఇద్దరితో సినిమా చేయాలనుకుంటోన్న దర్శకుడెవరో తెలుసా..? జయేంద్ర.. పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ.. యస్.. లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా నా నువ్వే అనే సినిమా తీసిన దర్శకుడే జయేంద్ర. నా నువ్వే ఈ నెల 25న విడుదల కాబోతోంది. ఆ తర్వాత మరోకొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టబోతున్నాడు జయేంద్ర. ఇందులో హీరోగా గోపీచంద్ ను ఫిక్స్ అయ్యాడట. హీరోయిన్ గా అనుష్కను తీసుకోవాలనుకుంటున్నారని.. ఆల్రెడీ ఆమెకు కథ చెప్పారని.. ఆమెకు నచ్చిందనే వార్తలూ వస్తున్నాయి. ఇక నా నువ్వే నిర్మించిన ప్రొడ్యూసర్సే ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ న్యూస్ అతి త్వరలనే తెలుస్తుంది. 

More Related Stories