English   

మురుగ‌దాస్ ద‌ర్శ‌కత్వంలో అల్లు అర్జున్

Allu Arjun
2021-05-04 19:37:05

ప్రస్తుతం తమిళ దర్శకులతో తెలుగు హీరోలు సినిమాలు చేసే ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే మెగాపవర్ స్టార్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత శంకర్ సినిమా ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా మరో మెగా హీరో అల్లుఅర్జున్ కూడా తమిళ దర్శకుడితో నెక్స్ట్ సినిమా చేయబోతున్నారట. 

తమిళ్ లో స్టార్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మురుగదాస్ తో బన్నీ సినిమా ఉండబోతుందట. అంతే కాకుండా ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించబోతున్నారట. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించబోతున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా గనక ఫిక్స్ అయితే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కబోతుంది.

More Related Stories