English   

మ‌హేశ్ ద‌ర్శ‌కుడితో ర‌జినీకాంత్ సినిమా..

AR-Murugadoss
2018-09-24 11:46:52

ఆ మ‌ధ్య భ‌ర‌త్ అనే నేనులో మ‌హేశ్ బాబు మాదిరి అంద‌రి సాక్షిగా అంతఃక‌ర‌ణ శుద్ధితో తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని ప్ర‌క‌టించాడు ర‌జినీ కాంత్. కానీ అవ‌న్నీ మాట‌ల వ‌ర‌కే కానీ చేత‌ల్లో కాద‌ని ఇప్పుడు నిరూపిస్తున్నాడు సూప‌ర్ స్టార్. ఈయ‌న తీరు చూస్తుంటే అస‌లు రాజ‌కీయాల‌పై ఇష్ట‌మే లేన‌ట్లు క‌నిపిస్తుంది. వాటిని సీరియ‌స్ గా కూడా తీసుకోవ‌డం లేదు ఈయ‌న‌. ర‌జినీకాంత్ కు పాలిటిక్స్ ఇష్టం లేవ‌ని తెలుసు.. ఎప్ప‌ట్నుంచో చెబుతున్న మాటే కానీ వ‌స్తాన‌ని చెప్పిన త‌ర్వాత కూడా ఇంకా ఇష్టం లేన‌ట్లుండ‌టం అభిమానుల‌ని క‌ల‌వ‌ర‌పెడుతున్న అంశం. లేక‌పోతే మ‌రేంటి..? ఓ వైపు ఎన్నిక‌ల టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతుంటే ఈయ‌న మాత్రం సినిమాలు చేస్తూ ఉన్నాడు. అన్ని పార్టీలు త‌మ త‌మ క్యాడ‌ర్ల‌ను సిద్ధం చేసుకుంటుంటే ర‌జినీ మాత్రం సినిమాలు సిద్ధం చేసుకుంటున్నాడు. కాలా త‌ర్వాత ఇప్పుడు న‌వంబ‌ర్ 29న 2.0 రెడీగా ఉంది.. కార్తిక్ సుబ్బ‌రాజ్ పెట్ట సినిమా కూడా వ‌చ్చే ఏడాది మొద‌ట్లో విడుద‌ల కానుంది. 

ఇది పూర్తి కావ‌డానికి క‌నీసం ఆర్నెళ్లైనా ప‌డుతుంది. ఇలాంటి టైమ్ లో ఆయ‌న నుంచి అద్భుతాలు ఆశించ‌లేం. ఆశించ‌డానికి ఇది సినిమా కూడా కాదు. డిసెంబ‌ర్ వ‌ర‌కు కార్తిక్ సినిమాతోనే బిజీగా ఉండే ర‌జినీ.. ఇప్పుడు మ‌రో సంచ‌ల‌నం సృష్టించాడు. మురుగ‌దాస్ తో ఈయ‌న సినిమా క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. స‌న్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం వీళ్లు విజ‌య్-మురుగదాస్ స‌ర్కార్ సినిమా కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత మురుగ‌దాస్-ర‌జినీ సినిమా ఉండ‌బోతుంది. చాలా ఏళ్లుగా ఈ కాంబినేష‌న్ కోసం చూస్తున్నారు ప్రేక్ష‌కులు. ఇప్పుడు కుదిరింది. జ‌న‌వ‌రి నుంచి సినిమా ప‌ట్టాలెక్క‌బోతుంది. మ‌రి ఇలా వ‌ర‌సగా సినిమాలు చేసుకుంటూ పోతుంటే రాజ‌కీయాలు ఎప్పుడు చేస్తాడు..? ఇదే అంద‌ర్లో వ‌స్తున్న అనుమానం. 

పోనీ ఇదేమైనా సినిమానా.. కోర‌గానే సిఎం ప‌ద‌వి వ‌చ్చి ఒళ్లో వాల‌డానికి..? ర‌జినీకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా ఆచుతూచి అడుగు వేయ‌క‌పోతే రాజ‌కీయాల్లో బొక్క‌బోర్లా ప‌డ‌టం ఖాయం అంటున్నారు విశ్లేష‌కులు. దీనికి చిరంజీవినే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు. ఎనిమిది నెల‌ల ముందు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. ఎన్నిక‌ల్లో పోటీ చేసి దారుణంగా బోల్తా కొట్టాడు మెగాస్టార్. అంత మాస్ ఇమేజ్ ఉన్నా కూడా స‌రిగ్గా ప్లాన్ చేసుకోక‌పోతే రాజ‌కీయాల్లో ఫ్లాప‌వ‌డం ఖాయం. మ‌రి ఇలాంటి టైమ్ లో ర‌జినీ ఏం చేస్తాడో చూడాలిక‌..!

More Related Stories