English   

నాని సినిమాకు రెహ‌మాన్ సంగీతం..? 

AR-Rahman
2018-12-04 05:31:25

రెండు ఫ్లాపులు వ‌చ్చినంత మాత్రానా త‌న జోరు త‌గ్గించ‌డంలో అర్థం లేదనుకుంటున్నాడు నాని. ఇంకా స్పీడ్ పెంచేసాడు ఇప్పుడు. వ‌ర‌స‌గా త‌న సినిమాలు ఓకే చెబుతున్నాడు. ప్ర‌స్తుతం జెర్సీ సినిమా న‌డుస్తుండ‌గానే విక్ర‌మ్ కే కుమార్ సినిమాను ఫైన‌ల్ చేసాడు. ఈ చిత్ర షూటింగ్ 2019 ఫిబ్ర‌వ‌రి 19 నుంచి మొద‌లు కానుంది. అదే ఏడాది సినిమా కూడా విడుద‌ల కానుంది. అన్నీ కుదిర్తే వ‌చ్చే ఏడాది ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఐదుగురు లేడీస్ ఉంటార‌ని.. క‌థ‌కు అదే కీ పాయింట్ అని తెలుస్తుంది. అందుకే నాని కూడా నేను.. విక్ర‌మ్.. ఆ ఐదుగురు అంటూ హింట్ ఇచ్చాడు. 

ఓ అమ్మాయి.. వాళ్ల అమ్మ‌.. మిడిల్ ఏజ్ ఆంటీ.. హీరోయిన్.. ఇంకో చిన్న పిల్ల‌.. ఇలా ఐదుగురు ఆడ‌వాళ్లు.. వాళ్ల‌తో నానికి ఉన్న రిలేష‌న్ పైనే క‌థ అంతా ఉంటుందని తెలుస్తుంది. విక్ర‌మ్ కే కుమార్ అంటేనే స్క్రీన్ ప్లే మాస్ట‌ర్. ఆయ‌న సినిమాలు అన్నీ గులాబి మొక్కకు అంటు క‌ట్టిన‌ట్లు చాలా జాగ్ర‌త్త‌గా స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇప్పుడు నాని సినిమా కూడా అలాగే ఉండ‌బోతుంది. ఇక ఈ చిత్రానికి పిసి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ అందించ‌బోతున్నాడు. దానికితోడు ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. గ‌తంలో రెహ‌మాన్ తో 24 సినిమాకు ప‌ని చేసాడు విక్ర‌మ్. ఇప్పుడు కూడా క‌థ న‌చ్చి తెలుగులో చాలా ఏళ్ల త‌ర్వాత సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడు రెహ‌మాన్. మ‌రి చూడాలిక‌.. నాని-విక్ర‌మ్ సినిమా ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories