English   

చిరు ప‌రువుకు బ‌న్నీ స‌వాల్..!

Chiranjeevi Allu Arjun
2018-07-24 07:01:46

నిజమే.. చిరంజీవి ప‌రువుకు ఇప్పుడు బ‌న్నీ స‌వాల్ విసురుతున్నాడు. దానికి కార‌ణం విక్ర‌మ్ కే కుమార్. త‌న‌కు తెలియ‌కుండానే మామ సినిమాతో పోటీ ప‌డుతున్నాడు అల్లుడు. బ‌న్నీ రెండు నెల‌లుగా ఖాళీగానే ఉన్నాడు. నా పేరు సూర్య ఫ్లాప్ త‌ర్వాత ఎందుకో తెలియ‌దు కానీ బాగా టైమ్ తీసుకుంటున్నాడు అల్లుఅర్జున్. విక్ర‌మ్ కే కుమార్ తో పాటు త్రివిక్ర‌మ్ క‌థ‌ల‌కు కూడా ఓకే చెప్పి రెండూ లైన్ లోనే పెట్టాడు ఈ హీరో. అయితే వీటిలో ముందు విక్ర‌మ్ సినిమా ఆగ‌స్ట్ లో మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.

ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. విక్ర‌మ్ కే కుమార్ కు ఇప్ప‌టికే రెహ‌మాన్ తో ఉన్న సాన్నిహిత్యం కార‌ణంగా ఆయ‌న ఒప్పుకున్నాడ‌ని కూడా తెలుస్తుంది. గ‌తంలో ఈ ఇద్ద‌రూ 24 సినిమాకు ప‌ని చేసారు. ఇదే కానీ జ‌రిగితే ఇప్పుడు చిరు ఇమేజ్ కు బ‌న్నీ స‌వాల్ విసిరిన‌ట్లే. ఎందుకంటే ఈ మ‌ధ్యే సైరా సినిమాకు ఈయ‌న్నే సంగీత ద‌ర్శ‌కుడిగా తీసుకున్నారు. కానీ సినిమా షూటింగ్ మొద‌లైన త‌ర్వాత త‌ప్పుకున్నాడు ఏఆర్ రెహ‌మాన్. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సంగీత ద‌ర్శ‌కున్ని తీసుకోనే లేదు చిరంజీవి. ఇలాంటి టైమ్ లో మామ సినిమా కాద‌ని అల్లుడి సినిమాకు సంగీతం అందిస్తే సంచ‌ల‌న‌మే.

More Related Stories