ఏఆర్ రెహమాన్.. కింగ్ ఆఫ్ మ్యూజిక్..

ఏఆర్ రెహమాన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. భారతీయులకే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులకు తెలిసిన పేరు రెహమాన్. కింగ్ ఆఫ్ మ్యూజిక్. ఆయన చూడని ఎత్తులే లేవు. ఇప్పుడు ఆయన కెరీర్ లో మరో కలుకితురాయి వచ్చింది. అదే ఐదోసారి నేషనల్ అవార్డ్ అందుకున్నాడు రెహమాన్. మణిరత్నం తెరకెక్కించిన చెలియా సినిమాకు గానూ ఆయన ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా అందులో పాడిన సాషాకు ఉత్తమ గాయనిగా అవార్డ్ దక్కింది. ఇక రెహమాన్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డు వచ్చింది. దీనికి ముందు నాలుగు అవార్డులు అందుకున్నాడు రెహమాన్. రోజా సినిమాకు గానూ తొలిసారి అవార్డ్ అందుకున్న రెహమాన్.. ఆ తర్వాత కూడా మెరుపుకలలు.. అమృత.. లగాన్ సినిమాలకు అవార్డులు అందుకున్నాడు రెహమాన్. ఇప్పుడు మరోసారి కాట్రు వెలియాదై సినిమాకు అవార్డు అందుకున్నాడు. ఇప్పటికే ఈయన ఖాతాలో రెండు ఆస్కార్లు.. రెండు గ్రామీ అవార్డులతో పాటు లెక్కలేనన్ని ఫిల్మ్ ఫేర్.. ఇంకెన్నో అవార్డులు ఉన్నాయి.