English   

2018 ఓవ‌ర్సీస్ అదిరిందిరో.. కుమ్మేస్తున్నారుగా..

Aravinda-Sametha
2018-10-16 14:13:04

1 మిలియ‌న్.. మా సినిమా ఓవ‌ర్సీస్ లో 1 మిలియ‌న్ వ‌చ్చింది తెలుసా..? ఎక్క‌డో దేశం కానీ దేశంలో మ‌న సినిమాలు 1 మిలియ‌న్ దాటేసాయి అంటే ఇక్క‌డ పండ‌గ చేసుకునే వాళ్లు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు. దానికి కార‌ణం కూడా ఉంది. ఎందుకంటే అక్క‌డ హాలీవుడ్, బాలీవుడ్ ప్ర‌భావాన్ని త‌ట్టుకుని మ‌న సినిమాలు నిల‌బ‌డటం చిన్న విష‌యం కాదు. కానీ రెండేళ్లుగా ఓవ‌ర్సీస్ ప‌రిస్థితి మారుతూ వ‌స్తుంది. మ‌న సినిమాలు అక్క‌డ బాలీవుడ్ ను కూడా బీట్ చేస్తున్నాయి. బాహుబ‌లిని ప‌క్క‌న‌బెడితే 2018 టాలీవుడ్ కు బాగా క‌లిసొచ్చింది. మ‌న సినిమాలు అక్క‌డ రికార్డులు తిర‌గ‌రాస్తున్నాయి. ఒక‌ప్పుడు 1 మిలియ‌న్ అంటే పండ‌గ చేసుకునే వాళ్ల‌కు ఇప్పుడు 2 మిలియ‌న్ కామ‌న్ అయిపోయింది. 3 మిలియ‌న్ కూడా అందుకుంటున్నాయి మ‌న సినిమాలు. 

ఏడాది మొద‌ట్లో డిజాస్ట‌ర్ టాక్ తో అజ్ఞాత‌వాసి 2 మిలియ‌న్ అందుకుంటే.. చిన్న సినిమాలుగా వ‌చ్చి మ‌హాన‌టి.. గీత‌గోవిందం 2.5 మిలియ‌న్ వ‌ర‌కు వెళ్లాయి. ఇక రంగ‌స్థ‌లం 3.5 మిలియ‌న్ తో చుక్క‌లు చూపిస్తే.. 3.3 మిలియ‌న్ తో భ‌ర‌త్ అనే నేను అద‌ర‌హో అనిపించింది. ఇక ఇప్పుడు అర‌వింద స‌మేత కూడా 2 మిలియ‌న్ దాటి 3 వైపు ప‌రుగులు తీస్తుంది. ఓవ‌ర్సీస్ లో వ‌ర‌స‌గా నాలుగు సినిమాల‌తో 1.5 మిలియ‌న్ అందుకున్న తొలి తెలుగు హీరో ఎన్టీఆరే. నాన్న‌కు ప్రేమ‌తో నుంచి మొద‌లైంది ఈ క‌లెక్ష‌న్ల వేట‌.. అక్క‌డ్నుంచి జ‌న‌తా గ్యారేజ్.. జై ల‌వ‌కుశ‌.. ఇప్పుడు అర‌వింద స‌మేత‌తో ఇది చేసి చూపించాడు ఈ హీరో. మొత్తానికి క‌లిసొచ్చిన 2018లో ఎన్టీఆర్ కూడా ఓ భాగంగా మారిపోయాడు. 

More Related Stories