English   

ఆగ‌స్ట్ 15న అర‌వింద స‌మేతుడు..!!

aravinda sametha

 యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న ఫ‌స్ట్ మూవీ అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌. యంగ్ టైగ‌ర్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ మూవీ టీజ‌ర్ ను ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఆ మ‌ధ్య ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ కు విప‌రీత‌మైన  స్పంద‌న‌ వ‌చ్చింది. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ త‌ర‌హా యాక్ష‌న్న తో పాటు త్రివిక్ర‌మ్ శైలి ఫ్యామిలీ ఎమోష‌న్స్ కూడా ఉంటాయ‌ని చెబుతున్నారు.

ఇక త్రివిక్ర‌మ్ హోమ్ బ్యాన‌ర్ హారిక హాసిని నుంచి తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో జ‌గ‌ప‌తిబాబు, నాగ‌బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో ఉన్నా.. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన ఫ్యాక్ష‌న్ చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఉంటుంద‌నే టాక్ ఉంది. ఇండ‌స్ట్రీ, ఆడియ‌న్స్ తో పాటు బిజినెస్ వ‌ర్గాల్లో కూడా ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. ద‌స‌రా బరిలో విడుద‌ల కాబోతోన్న అర‌వింద స‌మేతుడు ఆగ‌స్ట్ 15న వ‌చ్చే టీజ‌ర్ తో త‌న రేంజ్ ఏంటో కాస్త ముందే చూపిస్తాడ‌నుకోవ‌చ్చు.
 

More Related Stories