English   

అకారంపై అంత ప్రేమేంటి త్రివిక్ర‌మ్..?

Aravindha-Sametha
2018-05-19 18:03:07

టైటిల్స్ పెట్ట‌డంలో త్రివిక్ర‌మ్ కు ప్ర‌త్యేక‌శైలి. ఈయ‌న టైటిల్స్ అన్నీ ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. టైటిల్ లోనే క‌థ చెప్పేలా ఉంటాయి కూడా. ఇక అన్నింటికీ మించి తెలియ‌కుండానే ఈయ‌న ఓ సెంటిమెంట్ కు అల‌వాటు ప‌డిపోయాడు. హిట్ వ‌చ్చినా.. ఫ్లాప్ వ‌చ్చినా ఇప్పుడు అది మార‌డం లేదు. అదే త‌న టైటిల్ తొలి అక్ష‌రం అ..తో మొద‌ల‌వ్వ‌డం. తాజాగా ఈయ‌న ఎన్టీఆర్ తో తెర‌కెక్కిస్తోన్న సినిమాకు అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసాడు. ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌లైంది. సిక్స్ ప్యాక్ తో పిచ్చెక్కిస్తున్నాడు జూనియ‌ర్. ఇవ‌న్నీ ఇలా ఉంటే త్రివిక్ర‌మ్ కు ఇప్పుడు అ.. అనే అక్ష‌రంపై ఎంత ప్రేమ ఉందో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అప్పుడెప్పుడో 13 ఏళ్ల కింద మ‌హేశ్ తో చేసిన సినిమాకు అత‌డు అని టైటిల్ పెట్టాడు త్రివిక్ర‌మ్. ఆ త‌ర్వాత అత్తారింటికి దారేది.. అ..ఆ.. ఈ మ‌ధ్యే ప‌వ‌న్ సినిమాకు అజ్ఞాత‌వాసి అన్నాడు. ఇక ఇప్పుడు మ‌ళ్లీ అ.. అక్ష‌రంతోనే అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ అంటున్నాడు. మొత్తానికి హిట్ ఫ్లాపుల‌తో ప‌నిలేకుండా త‌న అకారం మీద ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు మాట‌ల మాంత్రికుడు.

More Related Stories