English   

 బృందావ‌నంలో అర‌విందుడు.. 

ntr-pooja
2018-05-20 15:28:26

అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ అంటూ త్రివిక్ర‌మ్ విడుద‌ల చేసిన బ‌ర్త్ డే పోస్ట‌ర్ లో ఎన్టీఆర్ లుక్ చూసి చాలా మందికి రుచించ‌లేదు. సిక్స్ ప్యాక్ తో ఉన్నా కూడా ఎందుకో కానీ ఎన్టీఆర్ కొత్త‌గా అనిపించ‌లేదు. ఈ లుక్ కు పాజిటివ్ రెస్పాన్స్ ఎంత వ‌చ్చిందో.. నెగిటివ్ కూడా అంతే వ‌చ్చింది. ఈ విష‌యం త్రివిక్ర‌మ్ అండ్ టీంకు అర్థ‌మైందో ఏమో కానీ వెంట‌నే మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు. అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ అంటూ వ‌చ్చిన ఈ మోష‌న్ పోస్ట‌ర్ లో ఎన్టీఆర్ అదిరిపోయాడు. ఆయ‌న లుక్ కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా బృందావ‌నంలో ఎన్టీఆర్ గుర్తుకొచ్చాడు. ప‌క్క‌నే పూజాహెగ్డే కూడా అందంగా ఉంది. ఈ జోడికి సూప‌ర్ రెస్పాన్స్ వ‌స్తుంది. నేరుగా ఇదే మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసుంటే రెస్పాన్స్ మ‌రోలా ఉండేదంటున్నారు ప్రేక్ష‌కులు. కానీ ఏం చేస్తాం.. ముందు అది వ‌చ్చింది.. ఇప్పుడు ఇది వ‌చ్చింది. ఏదేమైనా మోష‌న్ పోస్ట‌ర్ కు మాత్రం రెస్పాన్స్ అదిరిపోయింది. ఇప్పుడు త్రివిక్ర‌మ్ మార్క్ స్ప‌ష్టంగా క‌నిపించింది. పైగా థ‌మ‌న్ కూడా మంచి ట్యూన్ ఇచ్చాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే సగం పూర్త‌యింది. అక్టోబ‌ర్ లో విడుద‌ల కానుంది అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌. ఇది ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో వ‌స్తున్న క‌థ‌. మ‌రి చూడాలిక‌.. అజ్ఞాత‌వాసిని ప‌ట్టించుకోకుండా త్రివిక్ర‌మ్ కు ఎన్టీఆర్ ఛాన్సిచ్చాడు.. మ‌రి ఆయ‌న ఏం చేస్తాడో..? 

More Related Stories