English   

అరవింద సమేతుడిని అమ్మేశారు

Aravindha Sametha Overseas Rights saled
2018-05-28 11:29:26

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న ఫస్ట్ మూవీ అరవింద సమేత వీరరాఘవకి భారీ క్రేజ్ వస్తోంది. హారికహాసిని బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. అక్టోబర్ లో దసరా సందర్భంగా విడుదల కాబోతోన్న అరవింద సమేత వీరరాఘవ ఓవర్శీస్ రైట్స్ అమ్మేశారు. యస్.. సినిమా విడుదలకు ఇంకా నాలుగైదు నెలలు టైమ్ ఉండగానే ఎల్.ఏ తెలుగు అనే డిస్ట్రిబ్యూటర్స్ వారు ఈ సినిమాను ఓవర్శీస్ లో విడుదల చేయబోతున్నారు. ఖచ్చితంగా చెప్పడం లేదు కానీ.. ఈ సినిమాకు అక్కడ హయ్యొస్ట్ రేట్ వచ్చినట్టు సమాచారం. అజ్ఞాతవాసికి మించిన రేట్స్ కు అమ్మేశారట నిర్మాత రాధాకృష్ణ. 

అయితే ఓవర్శీస్ లో త్రివిక్రమ్ కు విపరీతమైన డిమాండ్ ఉండటం.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫుల్ స్వింగ్ లో ఉండటంతో పాటు అతనికీ ఓవర్శీస్ మార్కెట్ బాగా పెరడగం వంటివన్నీ ఈ ఫ్యాన్సీ రేట్ కు కారణంగా చెప్పొచ్చు. థమన్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీలో అరవిందగా పూజా హెగ్డే నటిస్తోంది. మరో తెలుగు బ్యూటీ ఈషా కూడా ఓ పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే  ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చెబుతున్నారు. ఫ్యాక్షన్ టచ్ కాకుండా త్రివిక్రమ్ శైలిలో సాగే కథ అంటున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే కు రిలీజ్ చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చిన నేపథ్యంలో అరవింద సమేత వీరరాఘవపై భారీ అంచనాలు పెరుగుతున్నాయనేది నిజం. 

More Related Stories