English   

అర‌వింద స‌మేత ఐదో పాట వ‌చ్చేసింది.. 

Aravindha-Sametha
2018-10-16 13:04:44

అర‌వింద స‌మేత‌లో నాలుగు పాట‌లే బ‌య‌టికి విడుద‌ల‌య్యాయి ఇప్పటి వ‌ర‌కు. కానీ సినిమా చూసిన వాళ్ల‌కు ఐదో పాట కూడా ఉంది. రంగ‌స్థ‌లం సినిమాలో ఎలాగైతే ఓ పాట‌ను సుకుమార్ దాచేసాడో.. త్రివిక్ర‌మ్ కూడా ఇదే చేసాడు. ఈ చిత్ర క్లైమాక్స్ లో జ‌గ‌ప‌తిబాబు చ‌నిపోయిన‌పుడు వ‌చ్చే పాట అది. రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో సాగే క‌థ కావ‌డంతో పూర్తిగా అలాంటి పాట‌లే రాయించుకున్నాడు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్. ఇప్పుడు ఈ పాట విడుద‌లైంది. పెంచ‌ల్ దాస్ పాడిన ఈ పాట వీడియో విడుద‌ల చేసారు. స్టూడియోలో థ‌మ‌న్ తో పాటు త్రివిక్ర‌మ్ కూడా అక్క‌డే ఉండి ఈ పాట పాడించుకున్నారు. దీన్ని పెంచ‌ల్ దాసే రాసారు కూడా. త‌మ సినిమాకు ఇంత‌గా అప్లాజ్ వ‌చ్చింద‌న్నా.. రాయ‌ల‌సీమ యాస ఇంత‌గా మాట్లాడాం అన్నా కూడా ఆ క్రెడిట్ అంతా మీదే స‌ర్ అంటూ పెంచ‌ల్ దాస్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు ఎన్టీఆర్. ఈ పాట కూడా అంతే బాగుంటుంది కూడా. ఊరికి ఉత్త‌రాన దారికి ద‌క్షిణానా అంటూ సాగే ఈ పాట‌లో చాలా మంది అర్థం కూడా ఉంది. మొగుడు చ‌నిపోయాడ‌ని.. ఆ చంపింది కూడా తానేన‌ని హీరో వ‌చ్చి విల‌న్ భార్య‌కు చెప్పే సంద‌ర్భం ఇది. మొత్తానికి ఈ ఎమోష‌న‌ల్ సాంగ్ ప్రేక్ష‌కుల‌కు కూడా బాగానే క‌నెక్ట్ అయింది. మ‌రోవైపు అర‌వింద స‌మేత ఇప్ప‌టికీ మంచి వ‌సూళ్లు సాధిస్తుంది. తొలి సోమ‌వారం కూడా 4.5 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు అర‌వింద స‌మేత ఖాతాలో 73 కోట్ల షేర్ వ‌చ్చింది. 

More Related Stories