English   

యంగ్ టైగర్ రోరింగ్ కు టైమ్ వచ్చేసింది

Aravindha-Sametha-teaser
2018-08-09 19:55:37

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తోన్న అరవింద సమేత వీరరాఘవ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వాటిని అందుకోవడానికి ఎంటైర్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేస్తోంది. హారిక హాసిని బ్యానర్ లో రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, నాగబాబు వంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో ఉన్నారు. త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎన్టీఆర్ టైమ్ మాస్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయీ సినిమాలో అనే టాక్ ముందు నుంచీ వినిపిస్తున్నదే. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండబోతోందీ సినిమాలో. మొత్తంగా ప్రారంభం నుంచీ ఈ సినిమాపై రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. రీసెంట్ గా ఎన్టీఆర్ రిలీజ్ చేసిన బర్త్ డే స్పెషల్ పోస్టర్ కు ఎంటైర్ ఇండస్ట్రీ ఖంగు తింది. ఇక ఈ నేపథ్యంలో ఈ యంగ్ టైగర్ రోరింగ్ కు టైమ్ వచ్చింది. 

ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అరవింద సమేత వీరరాఘవ టీజర్ విడుదల కాబోతోంది. ఖచ్చితమైన టైమ్ మరో రెండు రోజుల్లో తెలుస్తుంది. అయితే టీజర్ మాత్రం ఆరోజు పక్కాగా వస్తుంది. ఈ టీజర్ మాత్రం మామూలుగా ఉండదు అంటున్నారు. ఇప్పటికే టీజర్ కటింగ్ మొదలైందట. ఈ టీజర్ లో మరో విశేషం ఏంటంటే.. థమన్ నేపథ్య సంగీతం హైలెట్ కాబోతోందట. మొత్తంగా ఈ టీజర్ తో బిజినెస్ వర్గాల్లో ఓ భారీ బజ్ క్రియేట్ చేయబోతున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ టీజర్ లో యంగ్ టైగర్ రోరింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 

More Related Stories