English   

అర్ధశతాబ్దం మూవీ రివ్యూ 

Ardha Shathadham
2021-06-11 22:48:36

కథ: కృష్ణ (కార్తీక్‌ రత్నం) ఊళ్లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. దుబాయ్‌ వెళ్లి బాగా సంపాదించి, తల్లిని, చెల్లిని బాగా చూసుకోవాలని అతని కోరిక. అలాగే తనతో పాటు చదువుకున్న పుష్ప(కృష్ణ ప్రియ)ను ప్రేమిస్తుంటాడు.  మరోవైపు ఊళ్లో చిన్న చిన్న విషయాలకు కూడా ఆ ఊరి పెద్దలు కులం, రాజకీయ రంగు పులుముతుంటారు. ఈ క్రమంలో పుష్పపై ఉన్న ప్రేమతో నిజానిజాలు తెలుసుకోకుండా కృష్ణ ఓ పని చేస్తాడు. అది కాస్తా ఊళ్లో గొడవలకు దారి తీస్తుంది. అసలు కృష్ణ చేసిన పని ఏంటి?  దాని వల్ల ఆ ఊళ్లో ఎలాంటి దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి? వీరి ప్రేమకి కులాల మధ్య కుమ్ములాటకి సంబంధం ఏంటి? చివరకు పుష్ప ప్రేమని కృష్ణ పొందాడా లేదా? అనేదే మిగతా కథ.

విశ్లేష‌ణ‌: ‘అర్ధశతాబ్దం’ సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న కథ, పాయింట్‌ బాగానే ఉన్నా, దాన్ని బలంగా చూపించడంలో తడబడ్డాడు. ప్రథమార్ధమంతా పుష్పను కృష్ణ ఇష్టపడటం, అతని చిన్ననాటి జ్ఞాపకాలతో సాగుతుంది. ఇవన్నీ చాలా రొటీన్‌గా సాగుతాయి. ఇక సెకండాఫ్‌లో అయినా  క‌థ సీరియ‌స్ ట‌ర్న్ తీసుకొని ఏవైనా ఇంట్రస్టింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయా అని ఆశపడే ప్రేక్షకుడి నిరాశే మిగులుంది. ఎవ‌రు ఎవ‌రిని చంపుతున్నారో ఎవ‌రికీ అర్థం కాదు. మరోవైపు ఊళ్లో జరిగే గొడవలను ఉద్దేశిస్తూ, మంత్రి అయిన శుభలేఖ సుధాకర్‌, ఎస్పీ అజయ్‌ల మధ్య నడిచే సబ్‌ ప్లాట్‌ ద్వారా ఏదో చెప్పాలనుకుని, ఇంకేదో చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి ‘అర్ధ శతాబ్దం’ దాటినా వ్యవస్థలో ఎలాంటి మార్పూలేదన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడు.  దాన్ని బలమైన సన్నివేశాల రూపంలో చెప్పలేకపోయాడు. 

న‌టీన‌టుల ప‌ర్ఫామెన్స్:  కార్తీక్‌ రత్నం నదైన నటనతో మెప్పించాడు.  విలేజ్‌కి చెందిన అబ్బాయిగా చాలా సహజంగా తన పాత్ర సాగుతోంది. ఇక పల్లెటూరికి చెందిన పుష్ప పాత్రకు పూర్తి న్యాయం చేసింది కృష్ణప్రియ. సంప్రదాయ దుస్తుల్లో తెరపై అందంగా కనిపించింది. వ్యవస్థపై చిరాకు పడే  ఎస్సై రంజిత్‌గా  నవీన్‌ చంద్ర పర్వాలేదనిపించాడు. సాయికుమార్‌, శుభలేఖ సుధాకర్‌, అజయ్‌ వంటి నటులున్నా పెద్దగా వాడుకోలేదు.

టెక్నిక‌ల్ టీం:  నఫల్‌ రాజా సంగీతం బాగుంది. ఒకట్రెండు పాటలు వినడానికి, తెరపైనా బాగున్నాయి. నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. అస్కర్‌, వెంకట్‌, ఈజే వేణుల సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె అందాలను, ప్రేమ సన్నివేశాలను చక్కగా చూపించారు. ప్రతాప్‌ కుమార్‌ ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పాల్సిందే. 

చివరగా: ‘అర్ధశతాబ్దం’ ...అర్థంలేని గొడవలు..!! 

రేటింగ్ : 2/5.

More Related Stories