English   

అభిమన్యుడుతో కురుక్షేత్రంకు ఊపొచ్చింది..

Arjun-movie
2018-06-27 18:02:13

యాక్షన్ కింగ్ అర్జున్ కెరీర్ లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అతను ఇప్పటికే 150 సినిమాలు చేశాడు. ఈ 150వ సినిమా ఆల్రెడీ తమిళ్ లో విడుదలైంది. తెలుగులో ఈ సినిమాకు కురుక్షేత్రం అనే టైటిల్ పెట్టారు. తమిళ్ లో మిక్స్ డ్ రివ్యూస్ తో ఆకట్టుకుంది. అయితే కొన్నాళ్ల క్రితం తెలుగులోనూ విడుదల చేసే ప్రయత్నాలు చేశారు. కానెందుకో కుదర్లేదు. బట్ ఇప్పుడు సడెన్ గా మళ్లీ సీన్ లోకి వచ్చింది. ఇవాళ నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా కురుక్షేత్రం ట్రైలర్ విడుదల చేశారు. అయితే ఇన్నాళ్లూ కామ్ గా ఉండి ఇప్పడు సడెన్ గా ఈ ట్రైలర్ రిలీజ్ చేయడం వెనక విశాల్ అభిమన్యుడు ఉన్నాడనేది కాదనలేని సత్యం. 

అభిమన్యుడులో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటించాడు. అలాగే అల్లు అర్జున్ నా పేరు సూర్యలోనూ ఓ కీలక పాత్ర చేశాడు. కానీ ఈ సూర్య ఫాదర్ పాత్ర పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ విశాల్ కు విలన్ గా ఇరగదీశాడు. ఈ క్యారెక్టర్ తో ఒక్కసారిగా మళ్లీ అర్జున్ మనకు బాగా దగ్గరయ్యాడు. ఆదగ్గర మళ్లీ దూరం కాకముందే తన కురుక్షేత్రం విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నాడు అర్జున్. అయితే ఒకప్పుడు అర్జున్ కు ఇక్కడున్న అభిమానులు చాలానే.కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆ మారిన ట్రెండ్ టేస్ట్ కు అనుగుణంగానే ఈ కురుక్షేత్రం కూడా ఉంటుంది. కాబట్టి.. యాక్షన్ కింగ్ కు ఈ మెమరబుల్ 150వ సినిమా కలిసొచ్చినా ఆశ్చర్యం లేదు. 

More Related Stories